ACHARYA: విడుదల వాయిదా..

'ఆచార్య' సినిమాను చిత్రబృందం వాయిదా వేసింది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ విపరీతంగా విస్తృతి చెందుతున్న నేపథ్యంలో 'ఆచార్య' సినిమాను వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక త్వరలోనే మళ్ళీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తాజా పోస్ట్‌లో పేర్కొన్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాలో రెజీనా కసాండ్ర, సంగీత స్పెషల్ సాంగ్స్‌లో అలరించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.