Acharya: కొత్త విడుదల తేదీ ఖరారు

ABN , First Publish Date - 2022-01-16T16:01:05+05:30 IST

'ఆచార్య' చిత్రాన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న

Acharya: కొత్త విడుదల తేదీ ఖరారు

'ఆచార్య' చిత్రాన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా వేస్తున్నట్టు సంక్రాంతి రోజు ప్రకటించి అభిమానులను నిరాశపరిచారు. దాంతో కొత్తగా రక రకాల రూమర్స్ మొదలయ్యాయి. ఇలా పోస్ట్ పోన్ చేస్తున్నామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే మళ్ళీ కొత్త విడుదల తేదీని ప్రకటించి మేకర్స్  సర్‌ప్రైజ్ చేశారు. 'ఆచార్య' చిత్రాన్ని ఉగాది పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీన అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. ఇందులో చిరుకు జంటగా కాజల్ అగర్వాల్, చరణ్‌కు జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  



Updated Date - 2022-01-16T16:01:05+05:30 IST