కదన రంగంలోకి కామ్రేడ్‌

చిరంజీవి, చరణ్‌ కలసి తొలిసారి పూర్తిస్థాయి పాత్రలు పోషించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఫిబ్రవరి 4న ఈ చిత్రం విడుదలకానుంది. ఇందులో కామ్రేడ్‌ సిద్ధ అనే శక్తిమంతమైన పాత్రలో చరణ్‌ కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంఽధించిన టీజర్‌ను ‘సిద్ధ సాగా’ పేరుతో ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కదన రంగంలో రామ్‌చరణ్‌ నక్సల్‌ గెటప్పులో ఉన్న ప్రీలుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌, చరణ్‌కి జోడీగా పూజాహెగ్డే నటించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మించాయి.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.