Acharya: చరణ్ పాత్ర నిడివిపై క్లారిటీ..ఎంతసేపుంటాడంటే..!

ABN , First Publish Date - 2021-12-02T14:23:12+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'ఆచార్య'. ఇందులో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసందే. సిద్దగా నటిస్తున్న చరణ్ పాత్ర 'ఆచార్య'

Acharya: చరణ్ పాత్ర నిడివిపై క్లారిటీ..ఎంతసేపుంటాడంటే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'ఆచార్య'. ఇందులో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసందే. సిద్దగా నటిస్తున్న చరణ్ పాత్ర 'ఆచార్య' సినిమాలో ఎంతసేపు ఉండబోతోందో అని చాలా నెలలుగా మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించి రక రకాల వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం చరణ్ పాత్ర నిడివి 40 నిమిషాలవరకు ఉంటుందట. ఇంట్రవెల్ బ్యాంగ్ పడేముందు చరణ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని, సెకండాఫ్‌లో 40 నిమిషాలకు పైగానే ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో చిరు - చరణ్‌ల కాంబినేషన్ సీన్స్ గూస్‌బంస్ వచ్చేలా ఉంటాయని ఇప్పటికే చిత్ర దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చారు. ఆ విషయం ఇటీవల వచ్చిన సిద్ద పాత్రకు సంబంధించిన టీజర్‌లోనూ అర్థమైంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించబోతోంది. 2022, ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురాబోతున్నారు.  

Updated Date - 2021-12-02T14:23:12+05:30 IST