Aamir Khan: ఓటీటీలోకి వచ్చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ABN , First Publish Date - 2022-10-07T01:15:05+05:30 IST

కొత్త రకం పాత్రలు, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నబాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan). బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంటాడు. బీ టౌన్‌లో రూ.100కోట్లు, రూ.200కోట్లు, రూ.300కోట్ల క్లబ్‌ను ప్రారంభించింది అతడే.

Aamir Khan: ఓటీటీలోకి వచ్చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కొత్త రకం పాత్రలు, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan). బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంటాడు. బీ టౌన్‌లో రూ.100కోట్లు, రూ.200కోట్లు, రూ.300కోట్ల క్లబ్‌ను ప్రారంభించింది అతడే. ఆమిర్ తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అమెరికన్ ఫిలిం ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump)కు రీమేక్‌గా రూపొందింది. కరీనా కపూర్ (Kareena Kapoor), నాగచైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలు పోషించారు. వయాకాం 18 స్టూడియోస్‌తో కలసి తన సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. సినిమా విడుదలయిన ఆరు నెలల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆమిర్ తెలిపాడు. కానీ, మూవీ పరాజయం పాలవడంతో రెండు నెలల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. 


‘లాల్ సింగ్ చడ్డా’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిజిటల్ రైట్స్ కోసం రూ.100కోట్లకు పైగా చెల్లించిందట. ఈ మూవీ అక్టోబర్ 6నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. గతంలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ చేసిన వ్యాఖ్యల ఫలితంగా ‘లాల్ సింగ్ చడ్డా’ వివాదాల్లో చిక్కుకుంది. ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో అనేక మంది పోస్ట్‌లు పెట్టారు. దీంతో తమ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయొద్దంటూ ఆమిర్, కరీనా ప్రేక్షకులను కోరారు. ‘లాల్ సింగ్ చడ్డా’ పాన్ ఇండియాగా రూపొందింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పించాడు. ఈ సినిమా ఏ భాషలో కూడా విజయం సాధించలేదు. డిస్ట్రిబ్యూటర్స్‌ భారీ స్థాయిలో నష్టపోయారు.

Updated Date - 2022-10-07T01:15:05+05:30 IST