Laal Singh Chaddha collections: ఆమీర్ ఖాన్ సినిమాకు మరీ ఇంత ఘోరమైన కలెక్షన్లా..? మొదటి వీకెండ్‌లో రూ.50 కోట్లు కూడా రాలేదుగా..!
ABN , First Publish Date - 2022-08-15T18:15:47+05:30 IST
బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన
బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ (Aamir khan) హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha)’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ (Kareena kapoor), టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య ముఖ్యపాత్రలు పోషించారు. హిందీతోపాటు తెలుగు, తమిళంలో ఆగస్టు 11న విడుదలైంది. అయితే విడుదలకి ముందే చాలా బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. కానీ మొదటి రోజు మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లని రాబట్టలేకపోయింది.
ఆమీర్ ఖాన్ కెరీర్‌లో మొదటిరోజు అతి తక్కువ కలెక్షన్లు సాధించిన మూవీస్‌లో ఈ సినిమాకూడా ఒకటి. కేవలం రూ.12 నుంచి 14 కోట్ల కలెక్షన్లని మాత్రమే రాబట్టగలిగింది. అయితే.. వారాంతంలో పుంజుకునే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ.. కలెక్షన్లను రోజు రోజుకి పడిపోతూ నాలుగు రోజుల్లో కేవలం రూ.37 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఆమీర్ లాంటి స్టార్ హీరో సినిమాకి వసూళ్లు తక్కువగా ఉండడం.. నాలుగు రోజుల్లో కనీసం రూ.50 కోట్ల కలెక్షన్లని కూడా సాధించలేకపోవడంతో సినీ లవర్స్ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మొత్తం నివ్వెరపోయింది. అంతేకాకుండా.. కొన్ని థియేటర్స్‌లో అయితే ఈ సినిమాని తీసేసి వేరే మూవీస్‌ని వేసుకుంటున్నారు.
గతంలో భారతదేశంలో అసహనం పెరుగుతుందంటూ ఆమీర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం. దాంతో క్యాన్సిల్ బాలీవుడ్, బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి ఈ మూవీ కలెక్షన్ల మీద భారీ ప్రభావాన్ని చూపింది. దాంతో.. తమ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన ఆమీర్, కరీనా.. తమ సినిమాని బాయ్‌కాట్ చేయొద్దంటూ వేడుకున్నారు. అయినప్పటికీ బాయ్‌కాట్ జరిగింది.