కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఆమిర్ ఖాన్ మాజీ భార్య

ABN , First Publish Date - 2022-01-15T20:24:02+05:30 IST

మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ కొన్ని రోజుల క్రితమే విడాకులు తీసుకున్నారు. అయినప్పటికి తాము స్నేహితులుగా

కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఆమిర్ ఖాన్ మాజీ భార్య

మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ కొన్ని రోజుల క్రితమే విడాకులు తీసుకున్నారు. అయినప్పటికి తాము స్నేహితులుగా కొనసాగుతామని వారు చెప్పారు. కిరణ్ రావ్ గతంలో దోబీ ఘాట్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఆమె 2వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. గత వారంలో పుణె దగ్గరి ప్రాంతంలో ఆ మూవీ షూటింగ్ ప్రారంభమయినట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆమిర్ ఖాన్ ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  


ఆమె దర్శకత్వం వహించబోయే చిత్రం కామెడీ- డ్రామాగా తెరకెక్కబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్క్రిఫ్ట్ వినగానే నిర్మాతగా వ్యవహరించడానికి ఆమిర్ ఒప్పుకున్నట్టు సమాచారం. ఆ మూవీ 3 పాత్రల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఆ సినిమాలో స్పర్శ్ శ్రీవాస్తవ్, ప్రతిభా రాంటా, నితాన్షి గోయెల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజా షెడ్యూల్ జనవరి 20 వరకు కొనసాగుతోందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. మహారాష్ట్రలోని వివిధ గ్రామాల్లో సినిమాను చిత్రీకరిస్తారట. ఈ ఏడాది ఏప్రిల్ లోపు షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో కిరణ్ రావ్ ఉన్నారట. బిప్లబ్ గోస్వామి ఆ చిత్రానికి కథను అందించారు. స్నేహా దేశాయ్ స్క్రీన్ ప్లే‌ను,  అమితాబ్ భట్టాచార్య లిరిక్స్‌ను అందిస్తున్నారు.

Updated Date - 2022-01-15T20:24:02+05:30 IST