బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తోన్న Aamir Khan కూతురు.. ఫొటోలు వైరల్..
ABN , First Publish Date - 2021-12-14T20:59:33+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ తన బాయ్ ఫ్రెండ్ అయిన నుపూర్ షీఖరేతో ఎంజాయ్ చేస్తోంది

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ తన బాయ్ ఫ్రెండ్ అయిన నుపూర్ షీఖరేతో ఎంజాయ్ చేస్తోంది. ఆమె బాయ్ ఫ్రెండ్ తాజాగా ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. మంచులో ఆమెతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికల్లో అతడు పోస్ట్ చేశాడు. ‘‘ మంచులో మొదటిసారి గడపడం ఇదే. చాలా అద్భుతంగా ఉంది ’’ అని ఆ ఫొటోల కింద అతడు కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కు ఐరా రిప్లై ఇచ్చింది. ‘‘ వాట్ ఏ క్యూటీ ’’ అనే కామెంట్‌ను ఆమె పోస్ట్ చేసింది.
నుపుర్ షీఖరే పోస్ట్ చేసిన ఫొటోల కింద అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ చూడ ముచ్చటైన జంట ’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ఆమిర్ సర్ కొత్త సినిమా షూటింగ్ ఇక్కడే జరుగుతోంది ’’ అని మరో నెటిజన్ స్పందించాడు. ‘‘జంట అద్భుతంగా ఉంది ’’ అని ఒక సోషల్ మీడియా యూజర్ స్పందించాడు. ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా నుపూర్ షీఖరేను ప్రేమిస్తున్నట్టు ఐరా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కూతురే ఐరా ఖాన్ అని అందరికి తెలిసిందే.