Aamir Khan: రణ్‌వీర్ సింగ్ న్యూడ్ పిక్స్‌పై స్పందించిన ఆమీర్.. గొప్ప శరీరాకృతి అంటూ..

Twitter IconWatsapp IconFacebook Icon
Aamir Khan: రణ్‌వీర్ సింగ్ న్యూడ్ పిక్స్‌పై స్పందించిన ఆమీర్.. గొప్ప శరీరాకృతి అంటూ..

బాలీవుడ్‌ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha)’ ఒకటి. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆమీర్ ఖాన్ (Aamir Khan) చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 1994లో హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రిమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కరీనా కపూర్(Kareena Kapoor), టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య(Naga Chaitanya) కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళంలో విడుదలకానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలోనే ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ ‘కాఫీ విత్ కరణ్‌’ షోకి వచ్చారు. అందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


గత కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ యువ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ఓ పేపర్ కోసం న్యూడ్ పిక్స్ తీసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. ఈ పిక్స్‌పై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వాటిపై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరూ నటుడికి సపోర్టు చేస్తున్నారు. కరణ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో సెలబ్రిటీలను రకరకాల ప్రశ్నలు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. ఆమీర్‌ని సైతం అలాగే రణ్‌వీర్ సింగ్ న్యూడ్ పిక్స్‌ని చూశారా.. మీ అభిప్రాయం ఏంటని అడిగాడు. దానికి ఆమీర్ మాట్లాడుతూ.. ‘అవును నేను వాటిని చూశాను. అతనికి మంచి శరీరాకృతి ఉంది. నా తెలిసి అది చాలా బోల్డ్ ప్రయత్నం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే.. తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావుతో విడాకుల తర్వాత కూడా మంచి బంధమే ఉన్నట్లు తెలిపాడు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.