Laal Singh Chadha: ‘లాల్ సింగ్ చడ్డా’ కోసం స్టార్ హీరో కుమారుడి ఆడిషన్

Twitter IconWatsapp IconFacebook Icon
Laal Singh Chadha: లాల్ సింగ్ చడ్డా కోసం స్టార్ హీరో కుమారుడి ఆడిషన్

మూడేళ్లకు ఓ సినిమా చేసినా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). ‘గజినీ’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ వంటి సినిమాలతో అభిమానులను అలరించాడు. ఆమిర్ చివరగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. దీంతో నాలుగేళ్ల విరామం తీసుకుని ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chadha) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం కోసం తన కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan) ను ఆడిషన్ చేశానని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు. కానీ, ‘లాల్ సింగ్ చడ్డా’ పాత్రకు స్టార్ అయితేనే న్యాయం చేకూర్చగలరని కొంత మంది సూచించడంతో తాను టైటిల్ రోల్ పోషించానని చెప్పాడు.      


‘లాల్ సింగ్ చడ్డా’ కోసం జునైద్ ఖాన్‌పై టెస్ట్ షూట్ చేశామని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు. టెస్ట్ షూట్‌ను చూడగానే తన పని అయిపోయిందనుకున్నానని ఆమిర్ చెప్పాడు. ‘‘జునైద్ చేసిన టెస్ట్ షూట్ చూడగానే నాకు మతి పోయింది. లాల్ పాత్రలో కొంచెం అమాయకత్వం ఉంటుంది. ఆ అమాయకత్వం జునైద్‌లో కనిపించింది. అతడిలో అది సహజసిద్ధంగా ఉంది. ఆ అమాయకత్వం నాలో లేదు. నేను దానిని తీసుకురావాలంటే కొంచెం కష్టపడాలి. జునైద్ అయితే సినిమాకు సరిగ్గా సరిపోతాడనుకున్నాను. అప్పటికే చిత్రం కోసం నేను 6నెలల పాటు గడ్డం పెంచాను. జునైద్ షూట్‌ను చూడగానే నేను షేవ్ చేసుకున్నాను. ఆ టెస్ట్ షూట్‌ను రాజ్ కుమార్ హిరాణీ, కరణ్ జోహార్, ఆదిత్య చోప్రాతో సహా దాదాపుగా 100మందికి చూపించాం. కానీ, అతుల్ కులకర్ణి, ఆది చోప్రా నేను మాత్రమే చేయాలని పట్టుబడ్డారు. ఈ సినిమాకు స్టార్ కావాలన్నారు. కొత్త నటుడు సరిపోడన్నారు. దీంతో మరల గడ్డం పెంచి నేనే నటించాను’’ అని ఆమిర్ ఖాన్ చెప్పాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ అమెరికన్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా రూపొందింది. అద్వైత్ చందన్ (Advait Chandan) దర్శకత్వం వహించాడు. కరీనా కపూర్, నాగచైతన్య, మోనా సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.