బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్న మూవీ ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆమీర్ ఖాన్ (Aamir Khan) హీరోగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రిమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ boycott Laal Singh Chaddha యాష్ ట్యాగ్ కొందరు నెటిజన్లు ట్రెండింగ్ చేశారు.
గత కొన్నేళ్ల క్రితం ఇండియాలో అసహనం (Intolerance in India) పెరిగిపోతోందని, వేరే దేశం వెళ్లిపోదామని ఆయన మాజీ భార్య అప్పట్లో అన్నట్లు ఆమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అది దేశవ్యాప్తంగా పెద్ద దూమారాన్నే రేపింది. అలాగే.. కరీనా కపూర్ సైతం ఓ సందర్భంలో నెపోటిజం (Nepotism) గురించి మాట్లాడుతూ.. నెపో కిడ్స్ అని విమర్శలు చేసేవాళ్లు మా సినిమాలు చూడకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ఇద్దరూ నటులు చేసిన కామెంట్స్ చాలామందికి కోపం తెప్పించాయి. దీంతో ఈ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు.
ఈ పరిణామంపై తాజాగా జరిగిన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమీర్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు బాధగా ఉంది. అలాగే.. ఇలా మాట్లాడుతున్న కొందరు నాకు ఇండియా అంటే ఇష్టం లేదని వారు నమ్ముతుండొచ్చు. అలా వారు అనుకుంటూ ఉండడం చాలా బాధగా అనిపిస్తోంది. వారి హృదయాలలో ఉన్నది నిజం కాదు. కొంతమందికి అలా అనిపించడం దురదృష్టకరం. దయచేసి నా సినిమాని బహిష్కరించకండి. నా సినిమా చూడండి’ అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.