Aamir Khan: ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడానికి కారణం అదే..

ABN , First Publish Date - 2022-08-09T19:32:05+05:30 IST

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో ఆమీర్ ఖాన్ (Aamir Khan) ఒకరు. ఈ టాలెంటెడ్ యాక్టర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత..

Aamir Khan: ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడానికి కారణం అదే..

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో ఆమీర్ ఖాన్ (Aamir Khan) ఒకరు. ఈ టాలెంటెడ్ యాక్టర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’. కరీనా కపూర్, టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య (Naga Chaitanya) ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రిమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ఆగస్టు 11న హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలు థియేటర్స్‌లో నడవకపోవడంపై ఆమీర్ మాట్లాడాడు.


ఆమీర్ మాట్లాడుతూ.. ‘నా ప్రకారం, మేము ఒక సాధారణ తప్పు చేస్తున్నాం. నిజానికి ఓటీటీల తప్పు ఏమీ లేదు. అవి సినిమా పరిశ్రమకి ఎంతో ఉపయోగపడతాయి. OTT అనేది సినిమాకి ప్రమాదం కాదు. మేమే వాటిని అలా తయారు చేస్తున్నాం. మా సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఇంటి దగ్గర కూర్చొని చూడొచ్చు. అలాంటప్పుడు జనాలు థియేటర్స్‌కి ఎందుకు వస్తారు. అదే చిత్ర పరిశ్రమ చేస్తున్నా పెద్ద తప్పు’ అని చెప్పుకొచ్చాడు.


ఆమీర్ ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమాలను ఓటీటీలో కూడా చూడాలి. కానీ ప్రేక్షకులకి కరెక్టు గైడెన్స్ ఇవ్వాలి. అతను సినిమాని థియేటర్స్‌లో చూడాలా లేక ఓటీటీలోనా అని. అందుకోసం ఆరు నెలలు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు సినిమా బావుందనే టాక్ వస్తే ప్రేక్షకులు వెంటనే థియేటర్స్‌కి వస్తారు. లేదంటే.. ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేసి చూస్తారు. కాబట్టి సినిమాలను 2,3 వారాల్లో ఓటీటీల్లో విడుదల చేయడం మానాలి’ అని తెలిపాడు.



Updated Date - 2022-08-09T19:32:05+05:30 IST