Viral Video: ప్రియుడితో ఆమీర్ ఖాన్ కూతురి నిశ్చితార్థం.. కుటుంబ సభ్యులు లేకుండానే..

ABN , First Publish Date - 2022-09-23T18:16:26+05:30 IST

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్ (Ira Khan) తన ప్రియుడు నుపుర్ షిక్రే (Nupur Shikhare)తో..

Viral Video: ప్రియుడితో ఆమీర్ ఖాన్ కూతురి నిశ్చితార్థం.. కుటుంబ సభ్యులు లేకుండానే..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్ (Ira Khan) తన ప్రియుడు నుపుర్ షిక్రే (Nupur Shikhare)తో తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. ఇది ఇండియాలో కాదు.. ప్రముఖ ఐరన్ మ్యాన్ ఇటలీ షోలో  జరిగింది. ఆ షో మధ్యలో నుపుర్ వచ్చి సడెన్‌గా ఐరాకు ప్రపోజ్ చేయగా.. ఆమె అంగీకరించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన వీడియోను ఐరా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వీడియోలో.. ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ షిక్రే రేస్ దుస్తులలో ఐరా వద్దకు వెళ్లడాన్ని చూడవచ్చు. మోకాళ్లపై కూర్చొని బాక్సులోని ఉంగరాన్ని తీసి ఐరాతో ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు. దీంతో వెంటనే ఐరా అంగీకరించడంతో నుపుర్ ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. అంతేకాకుండా.. ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకున్నారు. ఇది చూసి అక్కడ ఉన్న జనాలు చప్పట్లతో ఆ జంటకి శుభాకాంక్షలు తెలిపారు. అందులో దంగల్ సినిమాతో పాపులారిటీ సాధించిన ఫాతిమా సనా షేక్..‘నేను చూసిన వాటిలో క్యూటెస్ట్ థింగ్ ఇదే’ అని రాసుకొచ్చింది. అలాగే రియా చక్రవర్తి సైతం.. ‘మీకు కంగ్రాట్స్’ అని రాసుకొచ్చింది. అలాగే.. సచిన్ కూతురు సారా టెండూల్కర్ అయితే.. ‘ఓ మై గాడ్ కంగాచ్యులేషన్స్’ అని తన సంతోషాన్ని తెలియజేసింది.


అయితే.. అక్కడ ఇద్దరి కుటుంబ సభ్యులు లేరు. దాంతో వారు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరోసారి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. కాగా.. ఐరా, నుపుర్ గత రెండేళ్లకు నుంచి డేటింగ్ చేస్తున్నారు. అయితే గత ఏడాది సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా వారు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. తరచూ సోషల్ మీడియాలో ఒకరి ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటూ.. తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు.



Updated Date - 2022-09-23T18:16:26+05:30 IST