నీ జత లేక... శిలగా మారా

ABN , First Publish Date - 2022-01-24T05:30:00+05:30 IST

గౌతమ్‌ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’.

నీ జత లేక... శిలగా మారా

గౌతమ్‌ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌ కృష్ణ దర్శకుడు. మనోజ్‌ డిజె, డా.మణికంఠ నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ‘శిలగా ఇలా నేనే మిగిలాను.. జతగా నువ్వు లేక ఏకాకిగా’ అనే గీతాన్ని ఆదివారం విడుదల చేశారు. చైతన్య ప్రసాద్‌ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని కాలభైరవ ఆలపించారు. జుడా శాండి స్వరాలు సమకూర్చారు. ‘‘ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ‘శిలగా ఇలా..’ పాట వినగానే అందరికీ నచ్చేసింది. మిగిలిన పాటలూ శ్రోతల్ని ఆకట్టుకుంటాయ’’న్నారు నిర్మాతలు. దేవి ప్రసాద్‌, బాల పరాశర్‌, సత్యం రాజేష్‌ తదితరులు నటించారు.

Updated Date - 2022-01-24T05:30:00+05:30 IST