రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) తొలి కలయికలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘లైగర్’ (Liger). ‘సాలా క్రాస్‌బ్రీడ్’ దీనికి ట్యాగ్‌లైన్. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ (RamyaKrishna) కీలక పాత్ర చేస్తున్నారు. విజయ్ బాక్సర్‌గా నటిస్తున్న ఈసినిమాలో మరో ముఖ్యపాత్రలో ప్రపంచ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) నటిస్తుండడం విశేషం. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన లైగర్ టీజర్, సింగిల్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 25న చిత్రం పాన్ ఇండిస్థాయిలో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు నిర్మాతలు. అందులో భాగంగా రేపు (శుక్రవారం) ఈ సినిమాలోని ‘ఆఫట్’ (Aafat) అనే సింగిల్ ను విడుదల చేస్తున్నారు. ఆ పాటకు సంబంధించిన ప్రమోను ఈ రోజు (గురువారం) వదిలారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సునీల్ కాశ్యప్ (Sunil Kashyap) సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలోని ఈ పాట చిత్రంలో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. తల్లీ, కొడుకుల మధ్యకు వచ్చే ఓ బ్యూటీ ఫుల్ డ్రామా క్వీన్ ఎప్పుడూ ఉంటుంది అంటూ విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ ఇంటికి వచ్చిన కథానాయిక అనన్యా పాండే ఇంట్లోకి వస్తానని అతడ్ని బతిమాలుకుంటోంది. అయితే అతను మాత్రం రావద్దని చెబుతున్నాడు. దీనికి కారణం ఇంట్లో అతడి తల్లి రమ్యకృష్ణ ఉండడమే. అయినప్పటికీ ఆమె కంట పడకుండా ఆ ఇద్దరూ మీట్ అవడాన్ని ఆఫట్ ప్రోమోలో చూడొచ్చు.
ముంబై స్లమ్స్ లో పెరిగిన ఒక ఛాయ్ వాలా .. బాక్సింగ్ చాంఫియన్ అవడం ‘లైగర్’ సినిమా ప్రధాన కథాంశం. అయితే ఆ లైగర్ ఎవరికి పుట్టాడు అనేది చిత్రానికి అసలైన కాన్ఫ్లిక్స్ట్. అతడి తండ్రి గా మైక్ టైసన్ నటిస్తున్నట్టు సమాచారం. సినిమాలో ఈ ఇద్దరిపై వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.