యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) కథానాయకుడిగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ (Sri Sathya Sai Arts)లో ఫణి కృష్ణ సిరికి (Phani Krishna Siriki) దర్శకత్వంలో నిర్మాత కె.కె. రాధామోహన్ (KK Radhamohan) నిర్మిస్తోన్న చిత్రం ‘క్రేజీ ఫెలో’ (Crazy Fellow). ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవంశి (Digangana Suryavanshi), మిర్నా మీనన్ (Mirnaa Menon) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో హీరో ఆది సాయికుమార్ చాలా యంగ్ అండ్ రిఫ్రెషింగ్‌గా కనిపిస్తున్నారు.
ఫస్ట్ లుక్ వీడియోలో ఆది చేష్టలు సినిమా టైటిల్‌కి తగ్గట్టు చాలా క్రేజీగా వున్నాయి. ఆది వేసుకున్న టీషర్టు పై ‘ఎవడి యాంగిల్ వాడిది’ అని రాసిన క్యాప్షన్ సినిమాలో హీరో పాత్రని సూచిస్తుంది. హెయిర్ స్టయిల్, ట్రెండీ దుస్తులు, లైట్ గడ్డం ఇవన్నీ ఆది లుక్‌ని మరింత స్టయిలిష్‌గా చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ (RR Dhruvan) సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల (Satish Mutyala) సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.