120 ఎపిసోడ్‌‌లతో వెబ్‌ సిరీస్‌.. టైటిల్ ఇదే!

ABN , First Publish Date - 2021-08-31T23:31:25+05:30 IST

సినిమాలకు ధీటుగా వెబ్‌ సిరీస్‌లకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనేక మంది నిర్మాతలు వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే ఈ వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు కూడా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా

120 ఎపిసోడ్‌‌లతో వెబ్‌ సిరీస్‌.. టైటిల్ ఇదే!

సినిమాలకు ధీటుగా వెబ్‌ సిరీస్‌లకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనేక మంది నిర్మాతలు వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే ఈ వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు కూడా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా నటీనటులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో విగటన్‌ టెలివిస్టార్‌, మోషన్‌ కంటెంట్‌ గ్రూప్‌ కలిసి ఒక వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తున్నాయి. దీనికి ‘ఆదలిన్‌ కాదల్‌ సెవ్‌వీర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశాయి. మొత్తం 120 ఎపిసోడ్‌లు కలిగిన ఈ వెబ్‌ సిరీస్‌లో మొదటి 5 ఎపిసోడ్‌లు విగటన్‌ విస్టార్‌ యూట్యూబ్‌ చానెల్‌లో టెలికాస్ట్‌ చేశారు. గతంలో అనేక టీవీ సీరియల్స్‌ను నిర్మించిన విగటన్‌ విస్టార్‌కు మంచి ఉమెన్‌ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. ముఖ్యంగా ‘వల్లమై తారాయో’ అనే వెబ్‌ సిరీస్‌ సూపర్‌హిట్‌ అయింది. 


దీంతో ఇపుడు పూర్తిగా కొత్త కథాంశంతో 2కే కిట్స్‌ అంశాల మేళవింపుతో దీన్ని నిర్మిస్తున్నారు. ఆరు ఫ్లాట్‌లలో నివసించే కొందరు స్నేహితులు తమ జీవితంలో ఎదురయ్యే సుఖదు:ఖాలు, కష్టనష్టాలతో పాటు ప్రేమ, స్నేహం, తమ సుధీర్ఘ లక్ష్యాలు, కలలను నెరవేర్చుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలతో పాటు హాస్యాన్ని జోడించి ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. రాజీవ్‌ కె.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌కు స్ర్కీన్‌‌‌ప్లే వీకే అమృతరాజ్‌, జో.జార్జ్‌ సమకూర్చారు. ఈ డిజిటల్‌ డైలీ సిరీస్‌కు టైటిల్‌ సాంగ్‌, సంగీతం జీవీ ప్రకాష్ అందించడం గమనార్హం. 

Updated Date - 2021-08-31T23:31:25+05:30 IST