‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ఆదాశర్మ. ఎందుకనో ఈ అమ్మడుకి టాలీవుడ్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సినిమాలు లేకపోతేనేం సోషల్ మీడియాలో మాత్రం ఆదా చాలా యాక్టివ్గా ఉంటోంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఆదాశర్మ ఓ వెబ్ సిరీస్లో నటిస్తుంది. వివరాల మేరకు ఈ సిరీస్లో అమ్మాయిగా మారుదామని అనుకున్న అబ్బాయి.. ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారుతాడు. ఆ అమ్మాయికి పెళ్లి జరిగిన తర్వాత, ఆమె భర్తకు ఈ నిజం తెలుస్తుంది. దీంతో ఆమె జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయనేదే కథాంశమట. ఇలాంటి బోల్డ్ పాత్ర తనకు గుర్తింపు తీసుకొస్తుందని ఆదాశర్మ భావిస్తుందట.