మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా తుది దశ చిత్రీకరణ జూలై 8 నుంచి ప్రారంభమవుతుందని సినీ వర్గాల సమాచారం. పన్నెండు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇందులో ఏడు రోజుల పాటు జరిగే షూటింగ్లో రామ్‌చరణ్ పాల్గొంటారు. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశం, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ చిత్రీకరణ పూర్తయిన తర్వాతే రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ ఇస్తారట. ఆలోపు థియేటర్స్ ఓపెన్ చేయడంపై ఓ క్లారిటీ కూడా వస్తుంది. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ జోడీ కట్టిన ఈ చిత్రంలో చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించింది. భారీ అంచనాలున్న ఈ సినిమాలో చిరంజీవి, చరణ్ నక్సలైట్స్ పాత్రల్లో కనిపించనున్నారు. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మాతలు.