Teaser: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. బట్ వన్ కండీషన్

ABN , First Publish Date - 2022-01-22T22:26:01+05:30 IST

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం

Teaser: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. బట్ వన్ కండీషన్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజై విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ చూసినట్టైతే..సినిమాలో సుధీర్ బాబు దర్శకుడి పాత్రలో కృతి శెట్టి డాక్టర్ అలేఖ్య పాత్రలో నటిస్తున్నారు. 


'రోల్ సౌండ్.. రోల్ కెమెరా.. యాక్షన్' అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్‌తో చిత్ర టీజ‌ర్‌ మొదలైంది. ఆరు సంవత్సరాల్లో ఆరు హిట్ సినిమాలు తీసిన దర్శకుడిగా హీరో సుధీర్ బాబుని పరిచయం చేశారు. అదే దర్శకుడు 'ఓ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ జరిగే కథ తీద్దామని అనుకుంటున్నాను' అని డైలాగ్ చెప్పడంతోనే హీరోయిన్ కృతి శెట్టిని పరిచయం చేశారు. డాక్టర్ అయిన కృతి శెట్టికి అసలు సినిమాలు అంటేనే పడదు. అలాంటి అమ్మాయిని హీరోయిన్‌గా తన కథలో చేయడానికి ఎలా ఒప్పించాడనేదే చిత్ర కథ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ చివరిలో 'మీ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను ..బట్ వన్ కండీషన్' అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని కలిస్తోంది. మొత్తంగా టీజర్ అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. 



Updated Date - 2022-01-22T22:26:01+05:30 IST