‘అదుర్స్’ విలన్‌పై కేసు.. మహిళలు, పిల్లలను అలా చూపించారంటూ..

ABN , First Publish Date - 2022-01-28T22:13:46+05:30 IST

ఎన్‌టీఆర్ హీరోగా నటించిన ‘అదుర్స్’ సినిమాతో పాపులారిటీ సాధించిన నటుడు మహేశ్ మజ్రేకర్...

‘అదుర్స్’ విలన్‌పై కేసు.. మహిళలు, పిల్లలను అలా చూపించారంటూ..

ఎన్‌టీఆర్ హీరోగా నటించిన ‘అదుర్స్’ సినిమాతో నటుడు మహేశ్ మజ్రేకర్ పాపులారిటీ సాధించాడు. ఈయనలో నటుడే కాకుండా డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సల్మాన్ ఖాన్ సినిమా ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’కి ఈయనే దర్శకత్వం వహించాడు. 


తాజాగా మహేశ్ డైరెక్షన్ చేసిన మరాఠీ సినిమా ‘నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నాయ్ కొంచా’ జనవరి 14న విడుదలైంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ది క్షత్రియ మరాఠా సేవా సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. చిన్న పిల్లలు, మహిళలను అభ్యంతరకర రీతిలో చూపించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు మహేశ్‌పై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఈ మూవీ నిర్మాతలు నరేంద్ర, శ్రేయాన్స్‌లపై కూడా కేసు నమోదైంది.


జనవరి 14న సినిమా హాళ్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలైన ఈ మరాఠీ చిత్రంలో మహిళలు, పిల్లలను అత్యంత అభ్యంతరకరమైన రీతిలో చూపించారు. దీంతో రాష్ట్రంలో అశాంతి నెలకొంది. మహారాష్ట్ర అంతటా నిరసనలు జరిగాయని న్యాయవాది డివి సరోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


అయితే దివంగత జయంత్ పవార్ రాసిన స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సమాజం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేరస్థులుగా మారిన ఇద్దరు టీనేజీ అబ్బాయిల కథే ఈ చిత్రం. కాగా, ఈ కేసుపై ఫిబ్రవరి 28న విచారణ జరగనుంది.

Updated Date - 2022-01-28T22:13:46+05:30 IST