ఆరు ప్రేమకథల సమాహారం...

ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రొమాంటిక్‌ కామెడీ ఆంథాలజీని రూపొందించనుంది. ఆరుగురు ప్రముఖ హిందీ దర్శకులు ఈ ఆంథాలజీసిరీస్‌ని తెరకెక్కించనున్నారు. విశాల్‌ భరద్వాజ్‌, హన్సల్‌ మెహతా, అలంకితా శ్రీవాస్తవా, సోనాలి బోస్‌, అంజలీ మీనన్‌, ధ్రువ్‌ సెహగల్‌ ఈ ఆరు ప్రేమకథలను డైరెక్ట్‌ చేయనున్నారు. అమెరికాలో హిట్‌ అయిన ‘మోడ్రన్‌ లవ్‌’ ఆంథాలజీ దీనికి స్ఫూర్తి. నిర్మాతలు ఇండియాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆరు ప్రేమగాథలతో ఈ ఆంథాలజీని తెరకెక్కించనున్నారు. త్వరలో ముంబైలో షూటింగ్‌ ప్రారంభించనున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.