‘777 Charlie’ లోని కుక్కకు ఒక్క సీన్ కోసమే ఏడాది శిక్షణ ఇచ్చామంటున్న డైరెక్టర్

ABN , First Publish Date - 2022-05-26T00:05:31+05:30 IST

‘అతడే శ్రీమన్నారాయణ’ (Athade Srimannarayana) చిత్రంతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం

‘777 Charlie’ లోని కుక్కకు ఒక్క సీన్ కోసమే ఏడాది శిక్షణ ఇచ్చామంటున్న డైరెక్టర్

‘అతడే శ్రీమన్నారాయణ’ (Athade Srimannarayana) చిత్రంతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘777 చార్లి’ (777 Charlie). సంగీత శ్రింగేరి, రాజ్ బి. శెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు  కీలక పాత్రలు పోషించారు. కె. కిర‌ణ్ రాజ్‌ (K. Kiran Raj) ద‌ర్శకత్వం వహించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర ట్రైలర్‪ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ధర్మ(రక్షిత్ శెట్టి)కు, చార్లీ అనే కుక్కకు మధ్య గల అనుబంధాన్ని ట్రైలర్‌లో చూపించారు.  


‘777 చార్లి’ సినిమాతోనే కిరణ్ రాజ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కలల ప్రాజెక్టు గురించి మీడియాతో మాట్లాడారు. ‘‘ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు ఏడుస్తున్నారు. ఈ చిత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. పెంపుడు జంతువులు ఉన్న వారికి ఈ మూవీ తప్పక నచ్చుతుంది. పెంపుడు జంతువులు లేకపోయినా సరే ఈ సినిమాను చూసినవారు తప్పక వాటిని ఇష్టపడటం ప్రారంభిస్తారు. లాబ్రాడర్ కుక్కలు భావాలను అద్భుతంగా పలికించగలవు. అందుకే ఈ మూవీ కోసం లాబ్రాడర్ కుక్కుని ఎంపిక చేశాం. చిత్రంలో మీరు చూసే పప్పీకీ రెండేళ్ల నుంచి రెండున్నరేళ్లు శిక్షణ ఇచ్చాం. కుక్క రక్షిత్‌ను కౌగిలించుకునే సీన్ ఉంటుంది. ఈ ఒక్క సీన్ కోసమే ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చాం. సినిమా స్క్రిఫ్ట్‌ను యేడాదిన్నర పాటు రాశాను. కుక్కల మీద పరిశోధన కూడా చేశాను. హాలీవుడ్‌లో ఇటువంటి చిత్రాలు గతంలో అనేకం వచ్చాయి. అయినప్పటికీ వాటితో ఈ చిత్రానికీ పోలిక లేదు. నేను మొదటి సారి కథ చెప్పినప్పుడు పాన్ ఇండియాగా ఎందుకు రూపొందించకూడదని రక్షిత్ ప్రశ్నించాడు. అందుకు నేను కొంచెం సమయం తీసుకున్నాను. కథలో మార్పులు చేశాను’’ అని కిరణ్ రాజ్ చెప్పారు. ‘777 చార్లి’ కీ రక్షిత్ శెట్టి నిర్మాతగా కూడా వ్యవహరించారు. చిత్రబృందం సినిమాలో నటించిన నాలుగు లాబ్రాడర్లను దత్తత తీసుకుంది.

Updated Date - 2022-05-26T00:05:31+05:30 IST