73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. నేడు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చరణ్ కూడా జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్'లో యువ అధికారి తరహా లుక్‌లో ప్లెయిన్ షర్ట్‌లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ తాజా లుక్ చూస్తుంటే చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్.సి.15 కోసం స్పెషల్‌గా మేకోవర్ అయ్యారని తెలుస్తోంది. ఇదే కార్యక్రమంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.