కొత్తగా రెక్కలొచ్చెనా.. అంటోన్న ‘వర్జిన్ స్టోరి’ హీరో

ABN , First Publish Date - 2022-01-22T04:07:33+05:30 IST

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరి’. గతంలో ‘రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో పాటు రీసెంట్‌గా విడుదలైన ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో విక్రమ్ కీలక పాత్రలలో

కొత్తగా రెక్కలొచ్చెనా.. అంటోన్న ‘వర్జిన్ స్టోరి’ హీరో

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరి’. గతంలో ‘రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో పాటు రీసెంట్‌గా విడుదలైన ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో విక్రమ్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పుడు ఈ ‘వర్జిన్ స్టోరి’ చిత్రంతో ఆయన హీరోగా పరిచయం అవుతున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి 3వ లిరికల్ సాంగ్‌ని చిత్రయూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ‘కొత్తగా రెక్కలొచ్చెనా..’ అనే లిరిక్స్‌తో వచ్చిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజును పురస్కరించుకుని.. ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్ల విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



Updated Date - 2022-01-22T04:07:33+05:30 IST