15 ఏళ్ల తరువాత 'తలై నగరం' సీక్వెల్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ హీరో సుందర్ సి 15 ఏళ్ల తరువాత 'తలై నగరం' సినిమా సీక్వెల్ మొదలుపెట్టబోతున్నట్టు తాజా సమాచారం. దర్శకుడిగా 30 చిత్రాలు పూర్తి చేసిన సుందర్ సి హీరోగానూ మంచి కథ అనిపిస్తే సినిమా చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన 'అరన్మణై 3' సీక్వెల్ మూవీకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూనే, హీరోగానూ ఓ కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. 

సుందర్ సి హీరోగా 2006లో చ్చిన 'తలై నగరం' హిట్‌గా నిలిచింది. దాదాపు 15 ఏళ్ల తరువాత ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు దురై మళ్లీ సీక్వెల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 'తలై నగరం 2'లోనూ సుందర్ హీరోగా నటించబోతున్నారు. అక్టోబర్ నుంచి ఈ మూవీ సెట్స్‌పైకి రానుందట. కాగా 'కట్టపవ కానోమ్' ఫేం మణి దర్శకత్వంలోనూ సుందర్ సి. ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే వెలువడనున్నాయి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.