సిలకా.. సిలకా.. ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఐటమ్ సాంగ్ విడుదల

ABN , First Publish Date - 2022-01-23T00:03:54+05:30 IST

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో.. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అజయ్ మైసూర్ సమర్పణలో.. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా ఈ చిత్రాన్ని

సిలకా.. సిలకా.. ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఐటమ్ సాంగ్ విడుదల

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో.. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అజయ్ మైసూర్ సమర్పణలో.. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలోని ‘సిలకా... సిలకా... రామా సిలకా’ అని సాగే ఐట‌మ్ సాంగ్‌‌ను శనివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాటని సురేష్ బొబ్బిలి స్వరపరచగా.. కాసర్ల శ్యామ్ రాశారు. రేవంత్ ఆలపించారు. ‘బాహుబ‌లి’లోని ‘మ‌నోహ‌రి...’ సాంగ్ త‌ర్వాత రేవంత్ పాడిన ఐట‌మ్ సాంగ్ ఇదే కావ‌డం విశేషం. 


ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. కాన్సెప్ట్ సరికొత్తగా ఉంటుంది. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. మనం డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసినా... టెన్త్ క్లాస్ మెమరీ మైల్ స్టోన్ లాంటిది. ఆ మెమ‌రీస్ మిగ‌తా జీవితం మీద డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా ప్ర‌భావం చూపిస్తాయి. ఒక రకంగా లైఫ్ పార్ట్‌న‌ర్ లాంటిది. ఈ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా, లైవ్లీగా సినిమాలో సన్నివేశాలు ఉంటాయి. ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్. తాజాగా విడుదల చేసిన పాటకి టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఇది మంచి ఐటమ్ సాంగ్. ప్రధాన తారాగణంతో పాటు 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, 30 మంది డాన్సర్లపై ఈ పాటను తెరకెక్కించాం. ఇద్దరు ముంబై డాన్సర్లు ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే రోజు(జనవరి 26)న టీజర్ విడుదల చేస్తాం..’’ అని తెలిపారు.



Updated Date - 2022-01-23T00:03:54+05:30 IST