అది సినిమా పాట కాదు, పాడింది ప్రసిద్ధ గాయకులు కారు, స్టార్ హీరోలు నర్తించ లేదు, అయినా యూట్యూబ్‌లో 9 నెలల్లో 105 కోట్ల వ్యూస్ సాధించి ఇప్పటికీ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో మార్మోగిపోతున్న ఆ ప్రైవేట్ సాంగ్ ‘52 గజ్కా దమన్’. పాడింది 19 ఏళ్ల రేణుక పన్వర్. ఉత్తరప్రదేశ్‌లోని ఖేకడా ఆమె స్వస్థలం. ఆమె పాడిన ప్రతి పాటకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. రేణుక మంచి డ్యాన్సర్ కూడా. స్టార్‌ప్లస్‌లో ప్రసారమయ్యే ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సింగ్ స్టార్’లో పాల్గొని టైటిల్ గెలిచింది. యూట్యూబ్ ద్వారా రేణుక రూ. 3 కోట్ల దాకా ఆర్జించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 5 లక్షలమంది ఫాలోవర్లున్నారు.