సహనంతోనే ప్రణయం

ABN , First Publish Date - 2022-01-23T08:17:57+05:30 IST

Virgin Story Movie

సహనంతోనే ప్రణయం

నిర్మాత లగడపాటి శ్రీధర్‌ తనయుడు విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వర్జిన్‌ స్టోరీ’. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. సౌమిక పాండియన్‌, రిషిక ఖన్నా కథానాయికలు.ప్రదీప్‌ బి.అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. లగడపాటి శ్రీధర్‌ నిర్మాత. ఈ చిత్రంలోని మూడవ పాటని శుక్రవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈతరం మెచ్చే ప్రేమకథ ఇది. సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుందన్న విషయాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాం. చిత్రీకరణ పూర్తయింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు. 

Updated Date - 2022-01-23T08:17:57+05:30 IST