Most Profitable Movie: 'పుష్ప 2', 'కల్కి'ల కంటే పెద్ద హిట్.. 'ప్రేమలు'

ABN , Publish Date - Jan 03 , 2025 | 04:46 PM

Most Profitable Movie: గతేడాది రిలీజైన మలయాళం సినిమా 'ప్రేమలు' కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న బడ్జెట్ తో రిలీజై భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమాని తర్వాత తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయగా సంచలన విజయం సాధించింది. అయితే ప్రాఫిట్స్ లో ఈ సినిమా కల్కి, పుష్ప 2 అందుకొని ఎత్తులను అందుకుంది. అదేలా అనుకుంటున్నారా..

'పుష్ప 2' మూవీ 1800 కోట్ల మార్క్ ని దాటేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా నిలిచింది. ఇక ప్రభాస్ 'కల్కి' సినిమా 1000 కోట్లను కొల్లగొట్టింది. ప్రేమలు సినిమా 146 కోట్లను సాధించింది. అయితే రూ. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ప్రేమలు సినిమా బడ్జెట్ కంటే 45 శాతం రెట్టింపు లాభాలను ఆర్జించింది. పుష్ప 2, కల్కి సినిమాలు బడ్జెట్ కంటే 5 రేట్ల లాభాలను కూడా నమోదు చేయలేదు. ఈ లెక్క ప్రకారం ఇండియాలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా 'ప్రేమలు' నిలిచింది. ఓవరాల్ ఇండియన్ వైడ్ గా టాప్ 3లో నిలిచింది. అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్, జై సంతోషిమాత సినిమాలు మాత్రమే 45% కంటే ఎక్కువ లాభాలను ఆర్జించాయి.


ఈ సినిమా కథ విషయానికొస్తే.. సచిన్‌ సంతోష్‌ (నాస్లెన్‌ కె.గఫూర్‌) ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. ఆ విషయాన్ని చెప్పేందుకు ధైర్యం చేయలేకపోతాడు. కాలేజీలో చివరిరోజు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఆ అమ్మాయేమో అప్పటికే వేరొకరితో ప్రేమలో ఉన్నానని చెబుతుంది. అలా తొలిసారి ప్రేమలో విఫలమైన సచిన్‌... యూకే వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. తీరా చూస్తే వీసా రాదు. దాంతో గేట్‌ కోచింగ్‌ కోసం స్నేహితుడు అమూల్‌ డేవిస్‌ (సంగీత్‌ ప్రతాప్‌)తో కలిసి హైదరాబాద్‌ చేరుకుంటాడు. అక్కడే రీనూ (మమిత బైజు) ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరుతుంది. ఓ పెళ్లి వేడుకలో వీరిద్దరూ కలుస్తారు. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు. ఈ సారైన సచిన్‌ ప్రేమకథ ఫలించిందా? లేక మళ్లీ అతని హార్ట్‌ బ్రేక్‌ అయ్యిందా? అన్నది కథ.

Updated Date - Jan 03 , 2025 | 04:49 PM