RC16 Sets: ఆర్‌సీ 16 సెట్‌లో ఏం వండుతున్నారు.

ABN , Publish Date - Mar 21 , 2025 | 02:28 PM

సెట్స్‌లో ఉన్న జాన్వీకు చరణ్‌ భార్య ఉపాసన  ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. అది ఏంటి? అందులో ఏముంది ?

శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi kapoor) ప్రస్తుతం ఆర్‌సీ16 (RC16) చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.  దేవర తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రమిది. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.  సెట్స్‌లో ఉన్న జాన్వీకు చరణ్‌ భార్య ఉపాసన (Upasana) ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఉపాసన అత్తగారు సురేఖ నిర్వహస్తున్న 'అత్తమ్మాస్‌ కిచెన్‌’కి (athammaskitchen) సంబందించిన ఫుడ్‌ ఐటమ్స్‌ గిఫ్ట్‌ ప్యాక్‌ను జాన్వీ కపూర్‌కి అందజేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. రామ్‌ చరణ్‌, జాన్వీ, ఉపాసన ఆర్డర్‌ బుక్‌ చేస్తే.. ఇటీవల డెలివరీ ఇచ్చినట్టు అత్తమ్మాస్‌ కిచెన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇంతకీ ఆర్సీ 16 సెట్స్‌లో ఏం వండబోతున్నారు... వేచి చూడండి’’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న ఆర్‌సీ 16 చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్ప్‌ బ్యాక్‌డ్రాప్‌ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామ్‌చరన్‌ కెరీర్‌కే మైల్‌స్టోన్‌గా నిలిచే చిత్రమిదని ఓ ఇంటర్వ్యూలో చరణ్‌ చెప్పారు. 

Updated Date - Mar 21 , 2025 | 02:29 PM