Padma Awards: చిన్నపిల్లాడి మనస్తత్వం.. సెట్‌లో సింహం
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:09 PM
సినీ పరిశ్రమకు సేవలందించినందుకుగానూ నందమూరి బాలకృష్ణ అజిత్‌కుమార్, శోభన తదితరులను పద్మభూషణ్ అవార్డులకు ఎంపిక చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నిర్మాణ సంస్థలు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించింది. సినీ పరిశ్రమకు సేవలందించినందుకుగానూ నందమూరి బాలకృష్ణ(PadmaBhushan Balakrishna), అజిత్‌కుమార్, శోభన తదితరులను పద్మభూషణ్ అవార్డులకు ఎంపిక చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నిర్మాణ సంస్థలు అవార్డుకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
కళారంగానికి విశేషమైన సేవలందించినందుకుగాను దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ్ఘభూషణ్ అందుకున్నందుకు బాలకృష్ణకు అభినందనలు. నటుడిగా, ఎమ్మెల్యేగా, క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా మీరు చేసిన ేసవలకు ఈ గౌరవానికి అర్హులు. అజిత్‌కుమార్, శోభనలకు ఈ అవార్డు రావడం చాలా గర్వంగా సంతోషంగా ఉంది’’
-సాయి దుర్గాతేజ్(Sai Durga tej)
‘‘ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు అభినందనలు. సినిమా, రాజకీయాలు, సామాజిక రంగాల్లో ఆయన సేవలకు ఈ పురస్కారానికి అర్హులు. మా ‘డాకు మహారాజ్’’కు శుభాకాంక్షలు’’
- డైరెక్టర్ బాబీ (Director Bobby)
‘‘బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. సినిమా, ప్రజా సేవకు మీరు అందించిన అసమాన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఈ పురస్కారానికి మీరు నిజంగా అర్హులు’’
- మంచు విష్ణు (manchu Vishnu)
‘‘చిన్నపిల్లాడి మనస్తత్వం.. సెట్‌లో సింహం. అందరికీ సోదరుడైన మా బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా శుభాకాంక్షలు. పద్మ అవారులకు ఎంపికైన వారందరికీ అభినందనలు’’
- నాని (Nani)
‘‘బాలకృష్ణ సర్.. మీరు చేసిన సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారానికి పూర్తి అర్హులు. ఇలాంటివి ఎన్నో అందుకోవాలి. ఈ అవార్డుకు ఎంపికేౖన అజిత్ కుమార్, ఇతర నటీనటులందరికీ అభినందనలు’’
- వరలక్ష్మి శరత్‌కుమార్ (Vara Lakshmi Sarathkumar)
‘‘పద్మభూషణ్ అవార్డుకు ఎంపికేౖన నటసింహం బాలకృష్ణకు అభినందనలు. ఆయన కృషి, అంకితభావం గౌరవాన్ని అందించాయి. పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’
- ప్రశాంత్ వర్మ (Prashanth VArma)