Sobhita Dhulipala: మా ఆయన బంగారం

ABN , Publish Date - Mar 19 , 2025 | 06:06 PM

అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం జరిగి మూడు నెలలు పూర్తయ్యింది. తాజాగా వీరిద్దరూ ఓ మ్యాగజైన్ కోసం మనసులోని మాటలు విప్పి చెప్పారు.

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) ‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తండేల్ తో 100 కోట్ల క్లబ్ లో చేరడంతో పాటు యువసామ్రాట్ రేంజ్ అమాంతం పెంచేసుకున్నారు. రీసెంట్ శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) తో పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా నాగచైతన్య దంపతులు వేకేషన్ మోడ్ లో ఉన్నారు. యూరప్ ట్రిప్ తో పాటు వివిధ ప్రాంతాలను చుట్టేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. తాజాగా ఈ దంపతులు వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఏప్రిల్ ఎడిషన్ కోసం ఫొటోలకు పోజులిచ్చింది. అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారాయి.


నాగచైతన్య పెళ్లి జరిగి మూడు నెలలు కావొస్తోంది. తాజాగా ఈ జోడి అరుదైన ఘనతను సాధించారు. పెళ్లి తర్వాత తొలిసారి ప్రముఖ వోగ్ (Vogue) మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ లవ్ జర్నీతో పాటు కెరీర్ కు సంబంధించిన పలు విషయాలను రివీల్ చేశారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శోభిత చెప్పిన అన్సర్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే అక్కినేని కోడలు... చైతూను మొదట్లో ఫాలో కాలేదని... ఆ తర్వాత ప్రొఫైల్ చూసి షాక్ అయ్యానని... కేవలం 70 మంది మాత్రమే ఉన్నారని ఆశ్యర్య పోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత చైతూను ఫాలో అయ్యానని... అలా మొదలైన స్నేహం ఇప్పుడు పెళ్లికి వరకు వచ్చిందని రివీల్ చేసింది.


తమ మధ్య ప్రేమ చాలా సింపుల్ గా అలా మొదలైపోయిందన్నారు శోభిత. చైతూకు తెలుగులో మాట్లాడం అంటే ఇష్టమని... ముంబైలో ఓ కేఫ్ లో ఫస్ట్ టైం చైతూ తో తెలుగులో మాట్లాడినట్లు గుర్తు చేసుకున్నారు. పైగా తరచూ తెలుగులో మాట్లాడమని అడిగే వారని... అలా తమ బంధం మరింత బలపడిందన్నారు. అయితే చైతన్య హైదరాబాద్ లో తాను ముంబైలో ఉండే దానిని... తనను కలిసేందుకు ముంబైకి వచ్చేవాడని... తమ లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. ఫస్ట్ టైం కలిసి నప్పుడు... తాను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడని... అప్పటి రోజులను రివైడ్ చేసుకుంది. అంతేకాక న్యూ ఇయర్ వేడుకలకు తనను ఆహ్వానించారని... ఈ తర్వాత ఇయర్ చైతన్య తమ పేరెంట్స్ కలిశారని... ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ ఏడాది... పెళ్లి చేసుకున్నామని అసలు మ్యాటర్ చెప్పింది.

Also Read: Committee Kurrollu: నిహారిక కొణిదెల రెండో సినిమా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 19 , 2025 | 06:06 PM