MS Dhoni: ధోనీని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:02 PM
సినిమా దర్శకులు రూపొందించే వాణిజ్య ప్రకటనలు సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటాయి. అలాంటి ఓ ప్రకటననే సందీప్ రెడ్డి వంగ ఎమ్మెస్ ధోనీతో చేశాడు.
సినిమాలకు, రాజకీయాలకు ఎలాగైతే అవినాభావ సంబంధం ఉందో... సినిమాలకు క్రికెటర్స్ కూ అలాంటి సంబంధమే ఉంది. చాలా మంది క్రికెటర్స్ కు సినిమా వాళ్ళు ఫ్యాన్స్! అలానే చాలామంది సినిమా వాళ్ళకు క్రికెటర్స్ అంటే అభిమానం. అందువల్లే క్రికెటర్స్, మూవీ స్టార్స్ ఖాళీ సమయాల్లో కలుసుకుని పార్టీలు చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే... చాలామంది క్రికెటర్స్ హీరోయిన్లను పెళ్ళాడిన ఉదాహరణలు బోలెడన్నీ.
ఈ విషయాలను పక్కన పెడితే... సినిమా దర్శకులకు క్రికెటర్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అరుదుగా వస్తుంటుంది. ఎందుకంటే... క్రికెటర్స్ ఎప్పుడో గానీ సినిమాల్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వరు కాబట్టి. కానీ అది యాడ్ ఫిల్మ్ అయితే తరచుగా ఛాన్స్ దక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే... ఇవాళ క్రికెటర్స్ చాలామంది యాడ్ ఫిల్మ్ ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. క్రికెట్ ఆడని టైమ్ లో వీళ్ళంతా బ్రాండ్ ప్రమోషన్స్ తోనే బిజీగా ఉంటారు. క్రేజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ సైతం చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాడు. తాజాగా ఎం.ఎస్. ధోనీ (MS Dhoni) చేసిన ఓ యాడ్ ను ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) డైరెక్ట్ చేశాడు. విశేషం ఏమంటే... దీనికి అతను తన లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ 'యానిమల్' (Animal) ను ధీమ్ గా తీసుకున్నాడు. అందులోని హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) మాదిరిగానే ధోనీని ఈ యాడ్ లో ప్రజెంట్ చేశాడు. అదే యాటిట్యూడ్ ను కాస్తంత భిన్నంగా ధోనీతో రీక్రియేట్ చేశాడు. ఈ యాడ్ మేకింగ్ విజువల్స్ ను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదిప్పుడు వైరల్ గా మారిపోయింది. ఫైనల్ గా రణబీర్ సిగ్నేచర్ మూమెంట్ నూ ధోనీతో సందీప్ వంగ చేయించడంతో సోషల్ మీడియాలో సెగలు మొదలయ్యాయి. ధోనీ, సందీప్ రెడ్డి కాంబో ను ఏ పర్పస్ తో అయితే సెట్ చేశారో... అది నెరవేరిందనే అనుకోవాలి.
Also Read: Happy Birthday: సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ లో సుశాంత్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి