Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Feb 05 , 2025 | 06:01 PM
సమంతతో విడాకుల అనంతరం హీరో నాగ చైతన్య రీసెంట్‌గా మరో నటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సమంత మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంటుంది. ఆమెపై కూడా ఈ మధ్య రూమర్స్ బాగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. చైతూ రెండో పెళ్లి చేసుకోవడంపై ఆమె తన తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
మాజీ భర్త నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోవడంపై సమంత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు వివాహ బంధం వదిలి వచ్చిన తర్వాత మీకెలా ఉంది? అలాగే మీ మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకోవడంపై ఏమైనా అసూయ పడుతున్నారా? అనేలా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు సమంత చాలా మెచ్యూరిటీగా జవాబు ఇచ్చింది. వాస్తవానికి చైతూతో విడిపోయిన తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూలలో ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. గదిలో ఇద్దరూ ఉన్నప్పుడు చేతిలో కత్తి ఉంటే.. ఘోరాలు జరిగిపోయేంతగా తమ మధ్య వాతావరణం ఉండేదని ఆ మధ్య చెప్పిన సమంత.. ఆ తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు చాలానే చేసింది. రీసెంట్‌గా కూడా ‘అవసరం లేకపోయినా.. అత్యధికంగా దేని కోసం ఖర్చు పెట్టారు’ అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ‘మాజీ భర్తకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చా’నంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తన తాజా ఇంటర్వ్యూలో మాత్రం అలా కాంట్రవర్సీకి చోటివ్వలేదు కానీ.. ఓ విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పేసింది. ముందుగా వివాహ బంధం వదిలిన అనంతరం జీవితాన్ని కొనసాగించడంపై మాట్లాడుతూ.. ‘ఆ బంధం నుండి బయటకు రావడానికి చాలా అంటే చాలా శ్రమించాను’ అని చెప్పుకొచ్చింది సమంత. మీ మాజీ భర్త మరో పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టడంపై మీకు ఏమైనా అసూయగా ఉందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘అసూయ.. నా జీవితంలో దాని కసలు తావులేదు. అసూయే అన్ని అనర్థాలకు కారణమని భావిస్తాను నేను. అందుకే నా జీవితంలో అసూయ భాగం కావడాన్ని అస్సలు అంగీకరించను’’ అని సమంత చాలా స్పష్టంగా తెలిపింది. ఆమె చెప్పిన దానిని బట్టి చూస్తే.. చైతూ మళ్లీ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆమె ఎప్పుడో వదిలేసిందనేది అర్థమవుతోంది.
Also Read- Tollywood Producer: పవన్ కళ్యాణ్, మహేష్‌లతో చేసిన చిత్రాలతో రూ. 100 కోట్లు నష్టపోయా..
సమంత విషయానికి వస్తే.. ‘ఏ మాయ చేసావే’ సినిమా టైమ్‌లో నాగ చైతన్యతో ప్రేమలో పడిన సమంత.. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు ఎంతో ప్రేమగా కలిసిమెలిసి జీవించిన ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో.. 2021లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం కొన్నాళ్ల పాటు ఒంటరిగానే జీవించిన నాగ చైతన్య.. రీసెంట్‌గా నటి శోభిత ధూళిపాలను రెండో వివాహం చేసుకున్నారు.
సమంత మాత్రం ఒంటరిగానే ఉంటుంది కానీ.. రీసెంట్‌గా ఆమె ‘సిటాడెల్: హనీ బన్నీ’ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఒక పికిల్‌బాల్ టోర్నమెంట్‌లో కనిపించడంతో.. వారు డేటింగ్ చేస్తున్నారనేలా వదంతులు మొదలయ్యాయి. వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ మ్యాచ్‌కు సంబంధించి ఆమె రీసెంట్‌గా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటోలలో రాజ్ నిడిమోరు చేతులు పట్టుకుని సమంత కనిపించడంతో వారి డేటింగ్ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ఫొటో అనే కాదు కానీ.. ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ అనుకున్నప్పటి నుండి వారి డేటింగ్‌పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.