Poonam Kaur: నాకు పాలిటిక్స్ తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే..
ABN , Publish Date - Jan 21 , 2025 | 06:13 PM
పూనమ్ కౌర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్‌లు వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్‌గా ఆమె ఒక డైరెక్టర్ పేరు రివీల్ చేసి.. ‘మా’ అసోసియేషన్‌కు లేఖ రాసినట్లుగా చెప్పుకొచ్చింది. ‘మా’ అసోసియేషన్ మాత్రం ఆమె మాకేం పంపలేదు అన్నట్లుగా స్పందించారు. అయితే అసలు ‘మా’ నుండి తను ఏమి కోరుకుంటుందో.. ABN ఆంధ్రజ్యోతికి తెలిపింది పూనమ్ కౌర్. ఆమె మాట్లాడుతూ..
పూనమ్ కౌర్.. కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా వినిపిస్తోన్న పేరు. రీసెంట్‌గా ఆమె ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని ట్వీట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘మా’కు సంబంధించి ఆమె చేసిన కొన్ని ట్వీట్స్ ఇంకా వార్తలలో నిలుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె ‘మా’ నుండి తను ఏం కోరుకుంటుందో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం వర్క్ చేసేందుకు రెడీగా ఉన్నాను. చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. మంచి అవకాశాలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా నేను ఫైబ్రోమైయాల్జీయాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దాని నుండి నేను కోలుకుంటున్నాను. మళ్లీ వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చిన్న చిన్న క్రాఫ్ట్‌లపై వర్క్ చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే, పని చేసే ముందు మన హెల్త్ బాగుండాలని కోరుకున్నాను. ఇంతకుముందు కంటే ఇప్పుడు నా హెల్త్ బాగానే ఉంది. అందుకే వర్క్ చేసేందుకు సిద్ధమయ్యాను. త్వరలోనే నేను చేసేవి అందరికీ తెలుస్తాయి.
Also Read- Saif Ali Khan: సైఫ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఆ రివార్డు ఏమిటంటే..
‘మా’ విషయానికి వస్తే.. నేను మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఝాన్సీగారికి కూడా ఫిర్యాదు చేశాను. చాలా రోజుల నుండి చాలా రకాలుగా నా గురించి మాట్లాడుతున్నారు. ఆ టైమ్‌లో నేను సైలెంట్‌గా ఉన్నాను. నాకు పాలిటిక్స్ తెలియవు. నేను వచ్చి మాట్లాడితే.. అటెన్షన్ కోసం చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. అందుకే చాలా గౌరవనీయమైన సంస్థ కాబట్టి ‘మా’ అసోసియేషన్ స్టేట్‌మెంట్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాను. నేను తప్పు ఒప్పులు చెప్పేకంటే.. ఒక అసోసియేషన్ పరంగా ఏం జరిగిందో బయటికి వస్తే బాగుంటుందని భావించాను. నిజంగా అందులో నా తప్పు ఉంటే చెప్పండి.. సరి చేసుకుంటాను. కానీ ఎందుకు ఎస్కేప్ అవుతున్నారో తెలియడం లేదు. ఎందుకు నా మాటని వినిపించుకోవడం లేదు.
Also Read- Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్.. హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా?
నేను చెప్పేది ఏమిటంటే.. ‘మా’ అసోసియేషన్ పిలిపించి, మాట్లాడి.. మీరు ఒక స్టేట్‌మెంట్ ఇవ్వండి. నా ఫ్యామిలీ, ముఖ్యంగా నాపై వచ్చే వార్తలతో మా అమ్మ బాధపడుతూ హెల్త్ పాడు చేసుకుంటుంది. నేను ఇక్కడికి ఏడ్వడానికి రాలేదు.. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి వచ్చాను. కొందరికి సపోర్ట్‌గా ఉండటానికి ‘మా’ అసోసియేషన్ కొన్ని ఫ్యామిలీస్ కోసం పెట్టింది కాదు కదా. నేను ఏం చెబుతున్నానంటే.. ఫస్ట్ నేను చెప్పేది వినండి.. తర్వాత మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయండి. నేను ఎవరిని హర్ట్ చేయాలని అనుకోవడం లేదు. రెండు వైపుల వారిని పిలిచి.. మాట్లాడి ఒక స్టేట్‌మెంట్ విడుదల చేయమని మాత్రమే కోరుకుంటున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.