బాలీవుడ్‌ వర్సెస్‌ సౌతిండియా మూవీస్‌’ టాపిక్‌పై చర్చ

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:39 AM

ప్రస్తుతం ఏ సినిమా అయినా పాన్‌ ఇండియా (Pan india Trend) ట్రెండ్‌లోనే నడుస్తోంది. అయినా బాలీవుడ్‌ వర్సెస్‌ సౌతిండియా మూవీస్‌’ Bollywood Vs South india) టాపిక్‌పై చర్చ జరుగుతూనే ఉంది.


ప్రస్తుతం ఏ సినిమా అయినా పాన్‌ ఇండియా (Pan india Trend) ట్రెండ్‌లోనే నడుస్తోంది. అయినా బాలీవుడ్‌ వర్సెస్‌ సౌతిండియా మూవీస్‌’ Bollywood Vs South india) టాపిక్‌పై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఓ ఛానల్‌ నిర్వహించిన ‘నిర్మాతల రౌండ్‌ టేబుల్‌’లో పాల్గొన్న నాగవంశీ, బోనీ కపూర్‌ దానిపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఇరువురి కామెంట్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. బోనీ కపూర్‌ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ ఉంది. తెలుగు చిత్రాలకు యూఎస్‌, తమిళ మూవీలకు సింగపూర్‌, మలేషియా, గల్ఫ్‌లలో మార్కెట్‌ బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. గల్ఫ్‌లో మలయాళం సినిమాలకే బిగ్గెస్ట్‌ మార్కెట్‌ ఉంటుందని నాగవంశీ అన్నారు. అనంతరం బాలీవుడ్‌ గురించి అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘సౌతిండియా ఫిల్మ్‌ మేకర్స్‌, యాక్టర్స్‌ బాలీవుడ్‌పై ప్రభావం చూపారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప 2’లాంటి చిత్రాలతో మార్పు చూసి ఉంటారు. ‘యానిమల్‌’, ‘జవాన్‌’ సినిమాలు దక్షిణాది దర్శకులు తెరకెక్కించినవే. హిందీ చిత్ర పరిశ్రమ ముంబయికే పరిమితమైంది’’ అని కామెంట్‌ చేయగా బోనీ కపూర్‌ దాన్ని అంగీకరించలేదు. అమితాబ్‌ బచ్చన్‌కు తాను పెద్ద అభిమానిని అల్లు అర్జున్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దానిపై నాగవంశీ స్పందిస్తూ.. షారుక్‌ ఖాన్‌, చిరంజీవికీ అల్లు అర్జున్‌ పెద్ద అభిమాని అని తెలిపారు. ‘‘తెలుగు, తమిళ, హిందీ ఇలా ఏ భాషల్లో తెరకెక్కినా ప్రేక్షకులకు ఏది నచ్చితే అదే మంచి సినిమా అని నేను నమ్ముతా. ఈరోజుల్లో మరాఠీ చిత్రాలు సైతం రూ.100 కోట్ల వసూళ్లు చేస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా వ్యాపారంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి’’ అని బోనీ కపూర్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 12:41 AM