Manchu Manoj: సింగిల్‌గా వస్తా.. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో..

ABN , Publish Date - Jan 18 , 2025 | 01:08 PM

నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా. నీకు నచ్చిన వాళ్లను నువ్వు తీసుకురావచ్చు లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్‌ పెట్టుకుందాం


మంచు ఫ్యామిలీ (Manchu Family) వార్‌ రోజురోజుకి పెద్దదవుతుంది. ఇంట్లో మొదలైన గొడవ పోలీస్‌ స్టేషన్‌, తిరుపతి, చంద్రగిరి రౌండప్‌ కొట్టగా ఇప్పుడు ఆ రచ్చ మరోసారి సోషల్‌ మీడియాలోకి వచ్చింది. మంచు మనోజ్‌ (Manoj) తాజాగా ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. 'కూర్చొని మాట్లాడుకుందాం విష్‌మిత్‌’’ అని మనోజ్ చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. ‘‘కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోని మహిళలు, స్టాఫ్‌, షుగర్‌ ఇవన్నీ పక్కనపెట్టి మనమే చర్చించుకుందాం. ఏం అంటావు? నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా. నీకు నచ్చిన వాళ్లను నువ్వు తీసుకురావచ్చు లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్‌ పెట్టుకుందాం. ఇట్లు నీ కరెంట్‌ తీగ’’ అంటూ ుఅత్తారింటికి దారేది’ చిత్రంలో బ్రహ్మానందం హేమ బుగ్గ గిల్లుతున్న ఫొటోను షేర్‌ చేశారు మనోజ్‌. ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్‌ పెట్టారనేది మాత్రం మనోజ్‌ డైరెక్ట్‌గా ఎక్కడా చెప్పలేదు. కానీ విష్‌మిత్‌ (VisMith)అని ట్యాగ్‌ పెట్టారు. అంతే కాదు..అంతకుముందుకు ట్వీట్‌లో కూడా ఫైర్‌గా మాట్లాడారు మనోజ్‌. కన్నప్ప చిత్రంలో కృష్ణంరాజుగారిలాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్‌ కుక్కకి ఉంటుంది. నువ్వు ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటావు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మనోజ్‌ ట్వీట్స్‌ విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా కుటుంబ వివాదంపై మంచు విష్ణుకు (Vishnu Manchu) తాజా ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది. ‘కన్నప్ప’ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణును.. ‘మనోజ్‌ పోరాటం దేనికోసం చేస్తున్నారు?’ అనే ప్రశ్న అడిగారు. దానిపై విష్ణు స్పందిస్తూ.. ‘‘నేను కన్నప్ప ప్రచారం కోసం ఈ ఇంటర్వ్యూకు వచ్చాను. దాని గురించి అడగండి. ఆ వివాదం గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. అయినా.. మనం చేేస చర్యలే మన వైఖరికి అద్దం పడతాయి. జనరేటర్‌లో పంచదార, ఉప్పు పోస్తే.. అవి ఫిల్టర్‌ ప్రాసెసింగ్‌లోనే ఆగిపోతాయి. అంతేకానీ, జనరేటర్‌ పేలదు’’ అని సమాధానమిచ్చారు.

 

Updated Date - Jan 18 , 2025 | 01:09 PM