Manchu Lakshmi: ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం.. మండిపడ్డ లక్ష్మి
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:18 PM
‘నా లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. ఇదొక రకమైన వేధింపు - Manchu Lakshmi
మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi) అసహనం వ్యక్తం చేశారు. ఆమె ప్రయాణిస్తున్న ఇండిగో (IndiGo) విమానయాన సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సంస్థకు చెందిన విమానంలో తాను ప్రయాణించగా.. ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. (Manchu Lakshmi Fire on Indigo Team)
‘నా లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. ఇదొక రకమైన వేధింపు. నా కళ్లెదుట సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈ విధంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు’’ అని ఆమె (manchu Lakshmi) పేర్కొన్నారు. ఇకపై తాను ఈ ఎయిర్‌లైన్స్‌కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతోపాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు.