Manchu Family: మరోసారి విష్ణుపై మనోజ్ మాటల యుద్ధం 

ABN , Publish Date - Mar 18 , 2025 | 08:28 PM

సినిమాల‌తో కాకుండా ఆస్తి వివాదంలో ఇటీవ‌ల‌ తెగ పాపులర్ అయిన మంచు బ్రదర్స్..ఒకరిపై ఒకరు విమర్శలతో హాట్ టాపిక్ గా నిలుస్తూ వ‌స్తున్నారు. కొద్దిరోజులుగా కాస్త సైలెంట్ అయ్యార‌నుకుంటే.. ఇప్పుడు మ‌ళ్లీ ఫైట్‌కు దిగుతున్నారు.

సినిమాల‌తో కాకుండా ఆస్తి వివాదంలో ఇటీవ‌ల‌ తెగ పాపులర్ అయిన మంచు బ్రదర్స్.... (manchu brothers) ఒకరిపై ఒకరు విమర్శలతో హాట్ టాపిక్ గా నిలుస్తూ వ‌స్తున్నారు. కొద్దిరోజులుగా కాస్త సైలెంట్ అయ్యార‌నుకుంటే.. ఇప్పుడు మ‌ళ్లీ ఫైట్‌కు దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో మోహన్ బాబు విష్ణుకు సపోర్ట్ గా నిల‌వ‌గా మ‌నోజ్ ఏకాకిగా మారాడు. అయితే ఆ క‌సితో మ‌రోసారి అన్న‌తో పోటీకి దిగేలా క‌నిపిస్తున్నాడు. అయితే ఈ సారి బాహాబాహీ కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అన్న‌తో పోటీగా బ‌రిలోకి సినిమాను దింప‌బోవ‌డ‌మే కాదు.. అంత‌కుమించిన హీట్ పుట్టించే కామెంట్స్ చేసి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. (manchu Family)

మంచు సోదరుల మధ్య ఫ్యామిలీ ఇష్యూ ఓ పక్క నడుస్తూ ఉండగానే.. విష్ణు తన కన్నప్ప సినిమా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. ఏప్రిల్ 25 న కన్నప్ప (Kannappa) పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే భారీ బడ్జెట్ తో అదిరిపోయే క్యాస్టింగ్ తో సినిమాకు కావాల్సినంత హైప్ ను క్రియేట్ చేశాడు విష్ణు. అయితే అదే రోజు మంచు మనోజ్ కీలకపాత్రలో నటించిన భైరవం‌ సినిమా రిలీజ్ కూడా ఉంటుందనే ప్రచారం మొదలైంది. మేకర్స్ ఆ సినిమాను ఏప్రిల్ 25 నే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే విష్ణు కన్నప్పను కూడా టార్గెట్ చేస్తూ మ‌నోజ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. కోట్లు ఖర్చు పెడితే సినిమా ఆడదంటూ తాను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

బైరవం (Bhairavam) మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కలసి నటిస్తున్నారు. వరుస ప్లాప్ లతో ఉన్న ఈ ముగ్గురు సినిమాలు సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. మంచు మనోజ్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాను ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. నిజానికి మార్చిలోనే భైరవం విడుదల కావాల్సి ఉన్నా.. అన్ సీజన్ కావటంతో సినిమా విడుదల ఏప్రిల్ కు మారింది. ఇప్పుడు కన్నప్ప విడుదల రోజే భైరవం కూడా వస్తుందనే వార్త ఆసక్తిని కలిగిస్తొంది.మరి మంచు సోదరుల మధ్య క్లాష్ ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి..

Updated Date - Mar 18 , 2025 | 08:37 PM