Super Star: సితారతో మహేశ్... ఆ గ్రేసే వేరు....
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:38 PM
మహేశ్ బాబు, సితార కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పటికే ఓ వాణిజ్యప్రకటనలో స్క్రీన్ షేర్ చేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్ చేశారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన గారాలపట్టి సితార స్క్రీన్ షేర్ చేసుకుని చేసిన యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రిన్స్ మహేశ్, రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నా.... కూతురుతో కలిసి చేసిన చిన్న యాడ్ సోషల్ మీడియాలో పాటు ఫ్యాన్స్ ను ఊపేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu ) కూతురు సితార (Sitara) స్పెషాలిటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. ఇక ఎదైనా ఫెస్టివల్ వచ్చిందంటే సితార హడావుడి మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోలతో ఎప్పుడు ట్రేండింగ్ లో ఉంటుంది. కామన్ గా క్యూట్ సితార అలా ఏదైనా వీడియో పెడితే చాలు ఖచ్చితంగా వైరల్ అవుతుంది. పైగా చిన్న ఏజ్ లోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది సితార! ఇటీవల తండ్రి బాటలోనే వరుసగా యాడ్స్ చూస్తూ వావ్ అనిపించుకుంటోంది.
సోషల్ మీడియాలో గౌతమ్ కాస్త సైలెంట్ గా ఉన్నప్పటికి... సితార పాప మాత్రం దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే న్యూయార్క్‌లోని టైమ్ స్వ్కేర్‌పై మెరిసింది. వెండితెర కంటే.... యాడ్స్ లో మెరుస్తూ అభిమానుల కోరికను తీరుస్తోంది. పైగా తండ్రి తో కలిసి రచ్చ చేస్తోంది. ఇప్పటికే తన క్యూట్ లుక్స్ తో కోట్లాది మంది అభిమానులకు క్రియేట్ చేసుకున్న ఘట్టమనేని ఆడపిల్ల... ఇప్పుడు మరోసారి తన మేనియాను చూపించింది. మొన్నటి కి మొన్న ట్రెండ్స్ కంపెనీ కోసం చేసిన యాడ్ బాగా వైరల్ కాగా ఇప్పుడు... మరో యాడ్ తో దుమ్మురేపింది.
మహేష్ బాబు తన లేటెస్ట్ లుక్ తో ఒక్క కమర్షియల్ యాడ్ ను చేశారు. అది కూడా ఆయన ఒక్కరే కాదు కూతురు సితార తో కలిసి నటించాడు. ఓ జువెలరీ కి సంబంధించిన బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు మహేష్ బాబు, తన కూతురు సితార తో కలిసి ఎనర్జిటిక్ యాడ్ లో కలిసి నటించడంతో పాటు అదిరిపోయే లుక్ తో మెరిసిపోయాడు. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ సాగే యాడ్ ఆకట్టుకుంటోంది. తన కూతురు చిన్నప్పటి ఫోటోలను చూస్తూ మురిసిపోతుంటాడు మహేష్. అంతలో మిర్రర్ లో రెడీ అవుతున్న కూతురును చూస్తూ ఆగిపోతాడు. ఏదో మిస్ అయిందంటూ సితార అంటుంటే... తన చేతిలో ఉన్న బంగారు కానుకగా ఆమెకు ఇస్తాడు. దానిని పెట్టుకుని కూతురు సంబరపడిపోతుంటే స్టన్నింగ్ అనేస్తాడు. 'నువ్వు కాదు నేను' అంటూ సాగిన ఈ వన్ మినిట్ యాడ్ చూడముచ్చటగా అనిపించడంతో పాటు అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంటోంది. మహేష్ కూతురుతో కలిసి చేసిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు దీనికి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ ను పెడుతున్నారు. వీరిద్దరూ ఫాదర్ అండ్ డాటర్ లా లేరని... బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సితార స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ పై కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఫ్యూచర్ లో మహేష్ తో కలిసి సితార సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఘట్టమనేని అభిమానులు ఆశపడుతున్నారు.
Also Read: Kavya Keerthi: సోలో క్యారెక్టర్ తో హలో బేబీ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి