Kollywood Directors: కోలీవుడ్ డైరెక్టర్లు.. భయపడుతున్న టాలీవుడ్ హీరోలు!
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:39 PM
కోలీవుడ్ డైరెక్టర్స్ అంటే చాలు టాలీవుడ్ హీరోలు భయపడిపోతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ ఇటు కోలీవుడ్ హీరోలతో, అటు బాలీవుడ్ హీరోలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇస్తుంటే.. కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ తెలుగు హీరోలకు మినిమమ్ హిట్ ఇవ్వలేక పేరు పోగొట్టుకుంటున్నారు. దీంతో కోలీవుడ్ దర్శకులతో సినిమా అంటే టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు భయపడే పరిస్థితి నెలకొంది. విషయంలోకి వస్తే..
పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఒక భాషలో మంచి పేరు, గుర్తింపుపొందిన దర్శకులు.. మరో భాషలో తమ సత్తా చూపించలేకపోతున్నారు. ప్రధానంగా కోలీవుడ్ దర్శకులు ఏమాత్రం రాణించలేకపోతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు హీరోలు కొంతమంది తమిళ దర్శకుల చిత్రాల్లో నటించారు. ఈ దర్శకులకు తెలుగులో స్టైట్ చిత్రాలు. ఇతర భాషల్లోకి కూడా డబ్బింగ్ చేసి భారీ అంచనాలతో రిలీజ్ చేశారు. ఈ మూవీలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ జాబితాలో పలువురు ప్రముఖ తమిళ దర్శకుల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే..
Also Read- Kiss Scene: ఆ ముద్దు సీన్ ట్రిమ్ చేశారు.. పాపం పూజా హెగ్డే?
1998లో పవన్ కళ్యాణ్ - కరుణాకరన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘తొలిప్రేమ’, 2001లో పవన్ కళ్యాణ్ - ఎస్.జె. సూర్య కాంబోలో వచ్చిన ‘ఖుషి’, 2010లో ప్రభాస్ - కరుణాకరన్ కాంబో వచ్చిన ‘డార్లింగ్’ సినిమాలు తప్పితే.. తమిళ దర్శకులెవరూ తెలుగు హీరోలకు హిట్స్ ఇవ్వలేకపోయారు. ‘ఖుషి’ లాంటి హిట్ ఇచ్చిన ఎస్. జె. సూర్య ‘కొమరం పులి’తో పవన్ కళ్యాణ్‌కి ప్లాప్ ఇస్తే.. ‘తొలిప్రేమ’ దర్శకుడు ‘బాలు’ రూపంలో మరో పరాజయాన్ని పవన్‌కు ఇచ్చాడు. 2011లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - విష్ణు వర్ధన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పంజా’ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా.. అంచనాలను అందుకోలేకపోయింది. అలాగే పవన్ కళ్యాణ్- ధరణి దర్శకత్వంలో వచ్చిన ‘బంగారం’ సినిమా పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే.
Also Read- Aditi Shankar: నాన్న పెట్టిన నిబంధన మేరకే సినిమాలు చేస్తున్నా..
2017లో మహేష్ బాబు - ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘స్పైడర్’ అటు తెలుగు, ఇటు తమిళంలో డిజాస్టర్‌గా నిలిచింది. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవితో మురగదాస్ చేసిన ‘స్టాలిన్’ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. ఎస్.జె. సూర్యతో మహేష్ చేసిన ‘నాని’ది కూడా సేమ్ రిజల్ట్. ‘అరిమా నంబి’, ‘ఇరుముగన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఆనంద్ శంకర్.. తెలుగులో యువ నటుడు విజయ్ దేవరకొండాతో తమిళం, తెలుగు భాషల్లో ‘నోటా’ పేరుతో రూపొందించిన మూవీ అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. ‘గీతాగోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండను నిరాశపరిచిన చిత్రంగా నిలిచిపోయింది.
Also Read- Chandini Tamilarasan: ‘నో’ చెబితే టచ్ చేసే సాహసం చేయరు
‘పురియాద పుదిర్’, ‘ఇస్పేట్ రాజావుమ్ ఇదయ రాణియుమ్’ ఫేం రంజిత్ జయకొడి తెలుగులో సందీప్ కిషన్‌తో ‘మైఖేల్’ టైటిల్‌తో భారీ యాక్షన్ మూవీ రూపొందించగా, తీవ్ర నిరాశపరిచింది. తమిళంలో ‘రన్’, ‘సండైకోళి’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎన్.లింగుస్వామి తెలుగు యువ హీరో రామ్‌తో కలిసి ‘ది వారియర్’ మూవీ చేశారు. ఈ హీరో చెన్నైలో పుట్టి పెరగడంతో కోలీవుడ్‌లో ఈ మూవీ ద్వారా అడుగుపెట్టాలని రామ్ ఎన్నో ఆశలుపెట్టుకోగా, ఈ మూవీ రెండు భాషల్లో డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
Also Read- Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2 రీ లోడెడ్’.. నీ యవ్వ ఇక తగ్గేదే లే..
అదేవిధంగా మరో యువ హీరో నాగచైతన్య - వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తమిళం, తెలుగు భాషల్లో వచ్చిన ‘కస్టడి’ సినిమా కూడా రెండు భాషల్లో నిరాశపరిచింది. కోలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.శంకర్ - టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ 2025 సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇది శంకర్‌కు తెలుగులో తొలి స్టైట్ మూవీ కావడం గమనార్హం. అయితే, ఈ మూవీ వసూళ్ళపరంగా కూడా భారీ నష్టాలను మిగిల్చింది.
నాని- గౌతమ్ మీనన్ ‘ఏటో వెళ్లిపోయింది మనసు’.. వెంకీతో పి. వాసు చేసిన ‘నాగవల్లీ’, బాలయ్యతో పి. వాసు చేసిన ‘మహారధి’, కె.ఎస్. రవికుమార్ చేసిన ‘రూలర్’, ‘బావ నచ్చాడు’, ‘జైసింహా’, శర్వానంద్ - చరణ్ ‘రాజాధిరాజా’, రానా- ప్రభు సాల్మన్ ‘అరణ్య’ వంటి సినిమాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. దీంతో కోలీవుడ్ టాప్ దర్శకులతో చిత్రాలు చేసేందుకు ప్రస్తుతం టాలీవుడ్ హీరోలతో పాటు నిర్మాతలు కూడా వెనుకంజ వేస్తున్నారు.