Klin Kaara Konidela: చరణ్‌ను తొలిసారి టీవీలో చూసి..ఉపాసన పోస్ట్ వైరల్ 

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:11 PM

తమ కుమార్తె క్లీంకారకు (Klin Kaara) సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తుంటారు  ఉపాసన కొణిదెల(Upasana Konidela) . తాజాగా ఆమె పంచుకున్న క్లీంకార వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో ఆ చిన్నారి . రామ్‌చరణ్‌ (Ram charan) నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ (RRR: Behind And beyond) వీక్షిస్తూ కనిపించింది.


తమ కుమార్తె క్లీంకారకు (Klin Kaara) సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తుంటారు  ఉపాసన కొణిదెల(Upasana Konidela) . తాజాగా ఆమె పంచుకున్న క్లీంకార వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో ఆ చిన్నారి . రామ్‌చరణ్‌ (Ram charan) నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ (RRR: Behind And beyond) వీక్షిస్తూ కనిపించింది. చరణ్‌ కనిపించగానే.. స్క్రీన్ వైపు చూపిస్తూ ముద్దుముద్దుగా మాట్లాడుతూ మురిసిపోతూ అలానే చూస్తూ ఉంది. తన తండ్రిని తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో ఆనందం వ్యక్తం చేసిందని ఉపాసన ఇన్‌స్టాలో పేర్కొన్నారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం మాకు ఎన్నో రకాల మధుర జ్ఞాపకాలను అందిస్తోంది. నాన్నను తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో ఆనందించింది. రామ్‌చరణ్‌.. నీ విషయంలో ఎంతో సంతోషం, గర్వంగా ఉన్నా. ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం ఎదురుచూస్తున్నా’’ అని తెలిపారు. రామ్‌చరణ్‌ దంపతులకు 2023లో క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. పాపకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఈ దంపతులు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్నా అందులో పాప ముఖాన్ని మాత్రం ఇప్పటి వరకూ చూపించలేదు. మెగా అభిమానులు క్లీంకారను  చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. భారీ వసూళ్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెర వెనుక సంగతులను ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ (RRR beyond and Behind) డాక్యుమెంటరీని చిత్రబృందం సిద్థం చేసింది. ఎంపిక చేసిన పలు థియేటర్లలో ఈ డాక్యుమెంటరీ గత నెల 20న రిలీజైంది. ప్రస్తుతం ఇది నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులో ఉంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయానికి వస్తే.. రామ్‌చరణ్‌ నటించిన సరికొత్త చిత్రమిది. శంకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్‌, సముద్రఖని కీలక పాత్రధారులు. చరణ్‌ ద్విపాత్రాభినయం పోషించారు. దిల్‌ రాజు నిర్మాత. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Updated Date - Jan 04 , 2025 | 05:11 PM