Shruti Haasan Marriage: పెళ్ళి మాటెత్తగానే శృతికి పూనకాలు వచ్చేశాయ్.. ఇచ్చిపడేసింది
ABN , Publish Date - Jan 28 , 2025 | 09:54 AM
శృతిహాసన్.. ఈ పేరు వినబడితే చాలు.. పెళ్లి ఎప్పుడు అని అడిగేస్తున్నారు. ఇలా తనని అస్తమాను పెళ్లెప్పుడు అని విసిగిస్తున్నవారిపై శృతిహాసన్ ఫైరయింది. అంతేకాదు, తన లైఫ్‌లో పెళ్లి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎందుకు ఫైరయింది? పెళ్లిపై ఆమె అభిప్రాయం ఏమిటి? అనే విషయాలలోకి వెళితే..
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) రెండుసార్లు ప్రేమలో విఫలమయ్యారు. ప్రస్తుతం ఆమె వద్ద పెళ్ళి ప్రస్తావన తెస్తే మాత్రం చిర్రుబుర్రులాడుతున్నారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్ళి ప్రస్తావన వచ్చింది. అంతే, ఒక్కసారిగా ఆమెకు పూనకాలు వచ్చేసి.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. వాస్తవానికి శృతిహాసన్‌కు పెళ్లంటూ ఆ మధ్య ఓ రేంజ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. తను చేసుకోబోయేవాడిని తండ్రి కమల్ హాసన్‌కు కూడా పరిచయం చేసినట్లుగా కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా. అయితే కూడా ఆ పెళ్లి ఆటకెక్కింది. ఆ తర్వాత ఆమె మరొకరి ప్రేమలో పడింది. మరి ఆ ప్రేమ కూడా విఫలం అయినట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న శృతిహాసన్‌ని అడిగితే..
Also Read- Wife Off Movie Review: బావని చిన్నప్పుడే భర్తగా ఊహించుకున్న మరదలు వేశ్యగా ఎందుకు మారింది?
దీనికి ఆమె సమాధానమిస్తూ.. ‘‘నాకు ప్రేమించడం ఇష్టం. ప్రేమించిన వ్యక్తితో కలిసి ప్రయాణించడం అమితమైన ఇష్టం. అయితే, ప్రేమించిన వ్యక్తినే పెళ్ళిచేసుకోవాలనే విషయంపై ఆలోచన చేయలేదు. నా పెళ్ళి గురించే ఎందుకు అడుగుతున్నారు? మీరేమైనా నా పెళ్ళి కరెంట్ బిల్లు చెల్లిస్తారా? లేదా పెళ్ళి భోజనం పెడతారా? ఈ రెండు కాకుంటే, నా పెళ్లి ఆహ్వానపత్రికలు ముద్రించి ఇస్తారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఇకపై పెళ్ళి గురించి ప్రశ్నలు అడగవద్దని శృతిహాసన్ కరాఖండీగా స్పష్టం చేశారు.
శృతిహాసన్ ఇచ్చిన సమాధానం విన్నవారంతా.. జీవితాంతం ఆమె ప్రేమికురాలిగానే ప్రేమికులను మార్చుకుంటూ పోతుందేమో అనేలా కామెంట్స్ చేస్తుండటం విశేషం. అయినా పెళ్లి అనేది ఆమె పర్సనల్ విషయం. అసలు చేసుకుంటుందో.. చేసుకోదో అనేది తన ఇష్టం. ఎప్పుడైనా ఒకసారి అంటే పర్లేదు కానీ.. పదే పదే అదే ప్రస్తావన తెస్తే చిరాకు రాకుండా ఎలా ఉంటుంది. అందుకే ఇచ్చి పడేసింది. ఇక పోతే.. శృతిహాసన్ ప్రస్తుతం ‘సలార్ 2’, ‘కూలీ’ సినిమాలలో నటిస్తోంది. ఈ సినిమాల అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.