Guess the Actress: లేటు వయసులోనూ ఘాటు ఎక్స్‌పోజింగ్! ఈ భామ ఎవరో కనిపెట్టారా?
ABN , Publish Date - Jan 24 , 2025 | 09:29 PM
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన ఈ హీరోయిన్.. అప్పటి స్టార్ హీరోలందరితోనూ నటించి టాప్ ప్లేస్‌లో కొనసాగింది. మిగతా హీరోయిన్లు అసూయ పడేలా వయసు పెరుగుతున్నా.. అందంలో మాత్రం ఆమె వన్నె తరగడం లేదు. తాజాగా ఈ బ్యూటీ కొన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేయడంతో.. ఆ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
భారతీయ చిత్రపరిశ్రమలో కొందరు నటీమణులకు వయసు పైబడుతున్నప్పటికీ వారి అందం మాత్రం తగ్గడం లేదు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్.. తర్వాత అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కానీ, తన అందచందాలను సోషల్ మీడియా వేదికగా ఆరబోస్తున్నారు. లేటు వయసులోనూ ఘాటు ఎక్స్‌పోజింగ్‌తో అలరిస్తున్న ఈ సుందరి ఎవరో కనిపెట్టారా? ఇంకెవరు ‘ఇష్టం’ శ్రియా శరణ్.
Also Read- Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?
ఒకప్పుడు తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన శ్రియ.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘శివాజీ’ సినిమాలో నటించడంతో కోలీవుడ్‌లోనూ మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ఈ భామ కోలీవుడ్‌లో మాత్రం చేసిన ఒకే ఒక్క తప్పుతో అగ్రహీరోయిన్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. ప్రముఖ హాస్య నటుడు వడివేలు హీరోగా వచ్చిన ‘ఇందిరలోగత్తిల్ నా అళగప్పన్’ అనే చిత్రంలో హీరోతో కలిసి ప్రత్యేక గీతంలో శ్రియ నటించారు. ఆ తర్వాత ఆమె సరసన ఏ తమిళ హీరో నటించేందుకు ముందుకురాలేదు. ఫలితంగా ఆమె కోలీవుడ్ కెరీర్ ముగిసిపోయింది.
అదే సమయంలో రష్యన్‌ను వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తనకు వచ్చిన ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోందీ భామ. అయితే, అభిమానులు తనను మరిచిపోకుండా సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేస్తూ.. తనలో ఇంకా వన్నె తరగని అందం అలానే ఉందని తెలియజేస్తుంది. తాజాగా లేటు వయసులోనూ ఘాటైన ఫొటో షూట్ చేసి, వాటిని ఇన్‌స్టా, ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల కింద నెటిజన్లు శ్రియ బ్యూటీని వర్ణిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.