Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 29 , 2025 | 08:47 AM

‘దంగల్’ సినిమాతో నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది ఫాతిమా సనా షేక్. ఈ సినిమాతో ఆమె అందరికీ తెలిసినా, అంతకంటే ముందే తెలుగులో ఆమె ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా టైమ్‌లో తను క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నానని, సదరు తెలుగు నిర్మాత చాలా పచ్చిగా అడిగారని తాజాగా ఫాతిమా ఓ నేషనల్ మీడియాకు తెలిపింది. దీంతో ఎవరా నిర్మాత అనేలా సెర్చింగ్ మొదలైంది.

Fatima Sana Shaik

‘దంగల్’ భామ ఫాతిమా సనా షేక్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ఓ టాలీవుడ్ నిర్మాతను ఉద్దేశిస్తూ.. సదరు నిర్మాత తనని పచ్చిగా అడిగేశాడని చెప్పడం.. సంచలనంగా మారింది. బాలీవుడ్ భామ ఏంటి? తెలుగు నిర్మాతపై ఇలా కామెంట్స్ చేయడం ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా. అసలు విషయం ఏమిటంటే.. తాజాగా ఫాతిమా సనా షేక్ ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌‌ని ఎదుర్కొన్నారా? అనే ప్రశ్నకి సమాధానం ఇస్తూ.. ‘‘అన్ని ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉంది. నేను కూడా ఎదుర్కొన్నాను..’’ అంటూ ఫాతిమా తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.


Taapsee Pannu: 15 ఏళ్లలో తొలిసారి ఆ దర్శకుడు నన్ను ఆహ్వానించాడు


ఆమె మాట్లాడుతూ.. ‘‘సౌత్‌లో గుర్తింపు తెచ్చుకుంటే.. నార్త్‌లో ఈజీగా అవకాశాలు వస్తాయని నమ్మేవాళ్లలో నేనూ ఒకర్ని. చాలా మంది విషయంలో అది నిజమైంది కూడా. అలా నేను టాలీవుడ్‌లో ‘నువ్వు నేను ఒకటవుదాం’ అనే సినిమాలో నటించాను. ఆ సినిమా నా నటనకు ఎంతో ఉపయోగపడింది. నేను అందరి దృష్టిలో పడేలా చేసింది. ఆ సినిమా తర్వాత మరో సినిమా అవకాశం వచ్చింది. ఆ అవకాశం నిమిత్తం మాట్లాడడానికి రమ్మంటే నిర్మాత దగ్గరకు వెళ్లాను. ఆ నిర్మాత పేరు చెప్పను కానీ.. అతను చాలా అసభ్యంగా మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఫేస్ చేయాల్సిందే. అలా నేను కూడా ఫేస్ చేశాను.


Also Read- Wife Off Movie Review: బావని చిన్నప్పుడే భర్తగా ఊహించుకున్న మరదలు వేశ్యగా ఎందుకు మారింది?

సదరు నిర్మాత నీకు అవకాశం ఇవ్వాలంటే మేము చెప్పిందల్లా చేయాలని అన్నాడు. సినిమా పరంగా ఏమైనా చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పాను. కానీ, ఆ నిర్మాత నన్ను తదేకంగా చూస్తూ.. చాలా అసభ్యకరంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పచ్చిగా మాట్లాడేశారు. ఆయన మాటలు, చూపులు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. వెంటనే ఆ చోటు నుండి వెళ్లిపోయాను. ఆ టైమ్‌లో ఇదొక్కటే కాదు.. ఇలా చాలానే ఫేస్ చేశాను. అందుకే చాలా సినిమాలలో అవకాశాలు వచ్చినా ఈ క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తిరస్కరించాను. మరోవైపు ఏదైనా చిన్న అవకాశం వస్తే.. క్యాస్టింగ్ డైరెక్టర్స్ మా రెమ్యునరేషన్‌లో 15 శాతం లాగేసుకునేవారు. ఆడిషన్ పూర్తయిన తర్వాత మాకు 15 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంటూ.. మాకు పేమెంట్స్ చేసే ముందే వారి కమీషన్ తీసేసుకునేవారు. ఇలా చాలా నష్టపోయాను..’’ అంటూ ఫాతిమా సనా షేక్ సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు టాలీవుడ్‌లో అగ్గిరాజేస్తున్నాయి.


FatimaSanaShaik.jpg

కాగా, ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ చిత్రం 2015‌లో విడుదలైంది. జీకేఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై గుర్రాల కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. పి. నర్సింహారెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజిత్ సోమి హీరోగా నటించగా, హీరోయిన్‌గా ఫాతిమా సనా షేక్ నటించింది. బెనర్జీ, ఆలీ, జయప్రకాశ్ రెడ్డి వంటి వారు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు.

Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

Also Read- Anil Ravipudi: ఇండస్ట్రీలోకి రాకముందే అనిల్ ప్రేమకి సహాయం చేసిన నటులు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 08:47 AM