Distributors and exhibitors: సంక్రాంతి.. నాలుగేళ్లతో లాభాలు తెచ్చిన సినిమా

ABN , Publish Date - Feb 03 , 2025 | 10:32 AM

థియేటర్ లో జనాలు ఉండరు కానీ, పోస్టర్లపై మాత్రం భారీ నంబర్లు కనిపిస్తాయి. మినిమం వంద కోట్లకు తగ్గకుండా పోస్టర్‌ బయటకు రాదు. ఇలాంటి సెల్ఫ్‌ డబ్బాకు అడ్డాగా మారిపోయింది తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ.

ఒకప్పుడు సినిమాలకు (TFI)సంబంధించి విజయవంతంగా వారం రోజులు, 25 రోజులు, 50 రోజులు, 100 రోజుల పోస్టర్లు కనిపిస్తుండేవి. ఇప్పుడు ఆ వరవడి లేదు. రోజులు మారాయి. ఓ సినిమా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంటే వారం రోజులు ఆడితే ఎక్కువ. ఆ వారం రోజుల్లోనే కోట్లు కొల్లగొట్టేయాలి. ఇదీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌. సక్సెస్‌ఫుల్‌గా ఇన్ని రోజులు నడిచింది అనే పోస్టర్ల నుంచి మొదటి రోజు ఇన్ని వందల కోట్లు, రెండో రోజు అన్ని వందల కోట్లు అంటూ పోస్టర్లు (Fake poster) వస్తున్నాయి. ఇంకా అడ్వాన్స్‌గా వెళ్తే.. విడుదలైన తొలి రోజే ‘మా సినిమా ఫలానా రికార్డ్‌ బ్రేక్‌ చేసింది’ అంటూ పోస్టర్లు వేయడం.. అది చూసి జనాలు (Fake collection poster) నవ్వుకోవడం కామన్‌ అయిపోయింది. (Distributors and exhibitors)

థియేటర్ లో జనాలు ఉండరు కానీ, పోస్టర్లపై మాత్రం భారీ నంబర్లు కనిపిస్తాయి. మినిమం వంద కోట్లకు తగ్గకుండా పోస్టర్‌ బయటకు రాదు. ఇలాంటి సెల్ఫ్‌ డబ్బాకు అడ్డాగా మారిపోయింది తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ. అయితే ఈ నంబర్లు అన్నీ జిమ్మిక్కులే అని పరిశ్రమకు, ఆ పోస్టర్లు వేయించే వారికీ, ముఖ్యంగా జనాలకు తెలుసు. అయినా ఎందుకీ అతి.. అతిశయోక్తి. ఆదివారం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki VAstunnam) డిస్టిబ్యూటర్ల ప్రెస్‌ మీట్‌ జరిగింది. ‘గత నాలుగైదేళ్లలో మా డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు మిగిల్చిన సినిమా ఇదే’ అని ఢంకా పథంగా చెప్పారు. మరి ఈ నాలుగైదేళ్లలో హిట్టయిన సినిమాలు డబ్బు తీసుకురాలేదా? అవన్నీ జిమ్మిక్కులేనా? ఇదే ప్రశ్న ఇప్పుడు. (Tollywood producers)


పోస్టర్లపై అంకెలు చూసి జనాలు (Fake collections) నవ్వుకొంటున్నారని, అవన్నీ కాకి లెక్కలని ఓ డిస్టిబ్యూటర్‌ నిర్మొహమాటంగా చెప్పాడు. ‘పోస్టర్లపై ఈ ఫేక్‌ అంకెలు ఎందుకు’ అని అడిగితే నిజాలు మాట్లాడితే కొంతమంది నిర్మాతలకు కష్టంగా ఉంటుందని, కడుపు చించుకొంటే కాళ్ల మీద పడుతుందని మరో డిస్టిబ్యూటర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దిల్‌ రాజు మాటలు కూడా అలాగే ఉన్నాయి. ‘గేమ్‌ చేంజర్‌’ తొలి రోజు దిల్‌ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఓ పోస్టర్‌ వదిలారు. తొలి రోజు వసూళ్లలో రికార్డ్‌ బ్రేక్‌ అయ్యిందంటూ గొప్పలు చెప్పుకొన్నారు. ఆ అంకెలు చూసి అంతా హేళన చేశారు. బాగా ట్రోల్‌ అయింది కూడా.  

దీనిపై దిల్‌ రాజు (Dil raju) తాజాగా స్పందించారు. అలాంటి పోస్టర్లు ఎందుకు వేయాల్సి వస్తుందో తెలీదా? అంటూ రివర్స్‌లో జర్నలిస్టులను ప్రశ్నించారు. అంటే ఫేక్‌ పోస్టర్‌ వదులుతున్నామన్న సంగతి జనాలకు తెలుసన్న విషయం దిల్‌ రాజుకీ తెలుసు. ఆయన మాటల తర్వాత మరెందుకు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు, ఆర్భాటపు నంబర్లతో పోస్టర్లు’ అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ సినిమా హిట్టయినా, ఫ్ల్లాప్‌ అయినా మొదటి తెలిసేది ప్రేక్షకుడికే. ఎంత వసూళ్లు వచ్చాయి అనేది అంకెల పరంగా అర్థం కాకపోయినా, నాలుగు డబ్బులు మిగిల్చిన సినిమానా? నష్టం తెచ్చిన సినిమానా? అనేది కూడా మొదటి రోజు టాక్‌తోనే తెలిసిపోతుంది. ఓ సినిమా విడుదలైంది అంటే.. సినిమా తీసినవాళ్లనుంచి డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌, చివరికి పోస్టర్‌ అంటించే వారి వరకూ ఆనందంగా ఉంటేనే, వాళ్ల చేతిలో లెక్క కరెక్ట్‌గా చేరితేనే అసలైన విజయం. అభిమానుల మెప్పు, హీరోల ఇగో శాటిస్‌ఫేక్షన్‌ కోసమే ఈ లెక్కల గారడీ అని అందరికీ తెలుసు. అంతకు మించి ఏమీ లేదు. నిజంగా లాభాలు భారీగా వచ్చిన ఏ నిర్మాతలు లెక్కలు బయటకు చెప్పడు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయినా సినిమాకు ప్రచారం ఎంత అవసరమే.. గొప్పల కోసం ఇప్పుడీ ఫేక్‌ ప్రచారాలు కూడా అంతే అవసరం అన్నట్లు ఉంది తెలుగు చిత్ర నిర్మాతల తీరు.  సంక్రాంతి బరిలో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.303 కోట్లు వసూళ్లు రాబట్టింది 

Updated Date - Feb 03 , 2025 | 11:11 AM