Cute actress: తెలుగు సినిమాను ఊపిన ఈ పాప ఎవరో తెలుసా

ABN , Publish Date - Jan 27 , 2025 | 09:39 AM

ఈ ఫొటోలో కనిపించే హీరోయిన్‌ కూడా అంతే దక్షిణాది భాషల్లో మంచి సినిమాలు చేసింది ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా పెంచుకుంది. ఇంతకూ పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కొందర్ని ఇలా రాగానే అలా స్టార్స్‌ ని  చేసేస్తుంది. కొంతమంది ఎక్కడ మొదలయ్యారో అక్కడే ఉండేలా చేస్తుంది. ఈ రోజు ఉన్నట్లు మరో రోజు ఉండదు. అలా చూస్తే హీరోయిన్స్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలానా హీరోయిన్‌ బావుంది.. బాగా యాక్ట్‌ చేస్తుంది అనుకునేలోపే కనుమరుగవుతారు. కొత్త కొత్త అందాలు ఇండస్ట్రీలో రాణిస్తున్న నేపథ్యంలో కొంతమంది హీరోయిన్స్‌ (Namitha Vankawala) ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఈ ఫొటోలో కనిపించే హీరోయిన్‌ కూడా అంతే దక్షిణాది భాషల్లో మంచి సినిమాలు చేసింది ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా పెంచుకుంది. ఇంతకూ పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? తన హాట్‌నెస్‌ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ చారెడేసి కళ్ళ చిన్నారికి ఏకంగా గుడి కూడా కట్టేశారు వీరాభిమానులు. ఇంతకు ఆ చిన్నారి ఎవరో కనిపెట్టారా? (Guess The cute baby Heroine)
Namitha.jpg

ఈ చిన్నారి మరెవరో కాదు. హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నమిత (Namitha) . 'సొంతం' సినిమాతో సొట్ట బుగ్గల సుందరిగా ప్రేక్షకులకు దగ్గరయింది. నమిత అసలు పేరు.. నమిత వాంక్వాలా. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో జన్మించిన ఈ బ్యూటీ.. 1998లో మిస్‌ సూరత్‌ గా, 2001లో మిస్‌ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సొంతం చేసుకుంది. సొంతం, ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి, జెమిని చిత్రాలలో నటించి మెప్పించింది. కొంత గ్యాప్‌ తర్వాత బిల్లా, సింహ సినిమాల్లోనూ నటించి అలరించింది. బిల్లా సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీలోనూ సినిమాలు చేసింది నమిత. నమిత 2017లో తిరుపతికి చెందిన నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని (Namitha Marriage)పెళ్లాడింది. వీరికి కవల పిల్లలు జన్మిచ్చారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. రెగ్యులర్‌ గా ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది (Actress Namitha).

Namitha-3.jpg

Updated Date - Jan 27 , 2025 | 11:01 AM