Critics Choice Awards: రెండు భారతీయ చిత్రాలకు నిరాశే.. స్క్విడ్ గేమ్2 కొట్టేసింది
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:41 PM
సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ (Critics Choice Awards) అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక వేదికైంది.
సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ (Critics Choice Awards) అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక వేదికైంది. వివిధ భాషలకు చెందిన చిత్రాలు వివిధ కేటగిరీల్లో పోటీపడగా వాటిలో కొన్ని సినిమాలు విజేతలుగా నిలిచి అవార్డులు సొంతం చేసుకున్నాయి ఈ అవార్డుల్లో సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘సిటడెల్ : హనీ బన్నీ’ (Citadel: Honey bunny) వెబ్ సిరీస్ పోటీపడింది. ఉత్తమ విదేశీ భాష సిరీస్‌ల జాబితాలో నామినేట్ అయిన ‘సిటడెల్’ అవార్డును గెలుచుకోలేకపోయింది.
దీనిపై ‘స్క్విడ్ గేమ్2’ ('Squid Game' Season 2) ఉత్తమ విదేశీ భాషా సిరీస్‌గా అవార్డును సొంతం చేసుకుంది. దీంతో స్క్విడ్ గేమ్ బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ (All We Imagine as Light) కూడా ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీపడింది. ఈ చిత్రం కూడా నిరాశ మిగిల్చింది. దీంతో మన దేశం నుంచి ఈ పోటీల్లో నిలిచిన రెండూ అవార్డులు గెలుచుకోలేకపోయాయి.
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల విజేతలు
ఉత్తమ విదేశీ భాషా సిరీస్ : స్క్విడ్ గేమ్ 2 (నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ చిత్రం : అనోరా
ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కుల్కిన్
ఉత్తమ సహాయనటి : జోయ్ సల్దానా
ఉత్తమ నటుడు: డెమి మూర్
ఉత్తమ నటి : కియేరన్ కుల్కిన్