Chiranjeevi: ప్రధానితో చిరు వీడియో కాన్ఫరెన్స్.. కారణమదే
ABN , Publish Date - Feb 08 , 2025 | 10:34 AM
భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే
భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా (Global Entertainment Hub) మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(World Audio Visual Entertainment Summit -Waves)’ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీని కోసం కొందరు ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ (PM Modi) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్ కోసం వారి నుంచి సలమాలు, సూచనలు తీసుకున్నారు. ఈ విషయాన్ని చెబుతూ చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ చేశారు. ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తన పోస్ట్‌లో పెట్టారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతోన్న వీడియోను పంచుకున్నారు. అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. (Chiranjeevi advisory board of waves)Vishwa
‘‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(వేవ్స్)’ కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మోదీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు’’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, షారుఖ్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అనిల్‌కపూర్, అనుపమ్ ఖేర్, హేమామాలినీ, దీపికా పదుకొణె తదితరులు పాల్గొన్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా ఈ సమావేశంలో పాల్గొని సమ్మిట్‌పై వారి అభిప్రాయాలు పంచుకున్నారు.